Kotha Prabhakar Reddy: పేదల భూములు ఆక్రమించిన ఈటల: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

ఈటల రాజేందర్ పేదల భూములు ఆక్రమించుకున్నారు. 84 ఎకరాల అసైన్డ్ భూమి ఆక్రమించుకున్నట్లు అధికారులు నిర్ధరించారు. దీనిపై చర్యలు తీసుకోకుండా ఈటల హైకోర్టుకు వెళ్లి, ఆపే ప్రయత్నం చేశారు. కానీ, న్యాయస్థానం కూడా వాస్తవాలేంటో నిర్ధరించాలని చెప్పింది.

Kotha Prabhakar Reddy: పేదల భూములు ఆక్రమించిన ఈటల: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

Kotha Prabhakar Reddy: ఈటల రాజేందర్ అక్రమంగా, అన్యాయంగా పేదల భూములు ఆక్రమించుకున్నారని ఆరోపించారు మెదక్ ఎంపీ, టీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డి. ఈటల భూకబ్జా నిజమేనని నిర్ధరించిన అధికారులు, వాటిని అర్హులైన హక్కుదారులకు అందజేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి బుధవారం 10టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘

PM Modi: మోదీ హైదరాబాద్ పర్యటనకు భారీ భద్రత

‘ఈటల రాజేందర్ పేదల భూములు ఆక్రమించుకున్నారు. 84 ఎకరాల అసైన్డ్ భూమి ఆక్రమించుకున్నట్లు అధికారులు నిర్ధరించారు. దీనిపై చర్యలు తీసుకోకుండా ఈటల హైకోర్టుకు వెళ్లి, ఆపే ప్రయత్నం చేశారు. కానీ, న్యాయస్థానం కూడా వాస్తవాలేంటో నిర్ధరించాలని చెప్పింది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు చేసిన విచారణలో భూ ఆక్రమణ నిజమేనని తేలింది. అది ప్రభుత్వ భూమి అని అధికారులు గుర్తించారు. 30 ఏళ్ల కింద ఇచ్చిన ప్రభుత్వ భూమిని ఈటల లాక్కున్నారు. ప్రభుత్వ భూమిలో రోడ్డును కూడా కబ్జా చేశారు.

GST: పెరగనున్న హోటల్ రూమ్ ఛార్జీలు.. కొత్త జీఎస్టీ వివరాలు ఇవే

బీజేపీ నేతలకు ఈ అన్యాయం కనిపించడం లేదా? జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై సమాధానం చెప్పాలి. అసైన్డ్ లబ్ధిదారులంతా వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీకి వినతిపత్రం కూడా అందిస్తారు’’ అని కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.