KTR : నీ గురించి వింటున్నా చరణ్.. చరణ్ ట్వీట్‌కి రిప్లై ఇచ్చిన కేటీఆర్‌..

రామ్ చరణ్ కూడా కేటీఆర్‌ కి ట్విట్టర్ ద్వారా మై డియర్ బ్రదర్, హార్డ్ వర్కింగ్ లీడర్ అంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. చరణ్ చేసిన ట్వీట్ కి కేటీఆర్‌ రిప్లై ఇస్తూ............

KTR : నీ గురించి వింటున్నా చరణ్.. చరణ్ ట్వీట్‌కి రిప్లై ఇచ్చిన కేటీఆర్‌..
ad

Ram Charan :  జులై 24న టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు కావడంతో ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సామాన్య ప్రజలు, కార్యకర్తల నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకు అందరూ ఆయనకి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్‌ ఎడమ కాలికి గాయం అవ్వడంతో డాక్టర్లు మూడు వారాల పాటు రెస్ట్ తీసుకోమన్నారు. దీంతో ఇంట్లోనే ఉంటున్నారు కేటీఆర్‌.

KTR : కేటీఆర్‌ గారు.. ఇవి చూసేయండి.. కేటీఆర్‌ ట్వీట్ కి రిప్లైలు ఇస్తున్న ఓటీటీలు

ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుండటంతో పుట్టిన రోజు సందర్భంగా తనకి సోషల్ మీడియాలో విషెష్ చెప్పిన చాలా మందికి ఓపిగ్గా రిప్లైలు ఇచ్చారు. సామాన్య ప్రజలు, ప్రముఖులు ఇచ్చిన ట్వీట్స్ కి రిప్లైలు ఇచ్చారు. ఇందులో కొన్ని ఇప్పుడు వైరల్ గా మారాయి. రామ్ చరణ్ కూడా కేటీఆర్‌ కి ట్విట్టర్ ద్వారా మై డియర్ బ్రదర్, హార్డ్ వర్కింగ్ లీడర్ అంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. చరణ్ చేసిన ట్వీట్ కి కేటీఆర్‌ రిప్లై ఇస్తూ..”బ్రదర్.. RRR సినిమాలో నీ పర్ఫామెన్స్ గురించి అందరూ గొప్పగా చెబుతుంటే వింటున్నాను. త్వరలోనే తప్పకుండా చూస్తాను” అని కేటీఆర్ పోస్ట్ చేశారు. దీంతో చరణ్ ఫ్యాన్స్ ఈ ట్వీట్ ని వైరల్ చేస్తున్నారు.