Vidhyullekha Raman : స్విమ్ సూట్ వేసుకుంటే విడాకులు ఇవ్వాలా??

ఇటీవల ఈ హాస్యనటి స్విమ్ సూట్ తో ఫోటోషూట్ తీసి ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలకి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. విద్యుల్లేఖ రామన్ ఆగష్టులో వ్యాపార వేత్త సంజయ్ ని

Vidhyullekha Raman :  స్విమ్ సూట్ వేసుకుంటే విడాకులు ఇవ్వాలా??

Vidyulla

Vidhyullekha Raman :  సినీ సెలబ్రిటీలకు అప్పుడప్పుడు నెటిజన్ల నుంచి ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎదురవుతాయి. కొంతమంది సెలబ్రిటీలు వాటికి ఘాటుగా సమాధానం ఇస్తారు. తాజాగా తెలుగు, తమిళ్ లో హాస్య నటిగా పేరు తెచ్చుకున్న విద్యుల్లేఖ రామన్ కూడా నెటిజన్ల నుంచి ఇలాంటి ప్రశ్నలని ఎదుర్కొంది.

ఇటీవల ఈ హాస్యనటి స్విమ్ సూట్ తో ఫోటోషూట్ తీసి ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలకి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. విద్యుల్లేఖ రామన్ ఆగష్టులో వ్యాపార వేత్త సంజయ్ ని ఘనంగా నిశ్చితార్థం చేసుకుంది. ఆ తరవాత కరోనా కారణంగా లాక్ డౌన్ వల్ల సింపుల్ గా ఎవరికీ తెలియకుండా వివాహం చేసుకుంది. ఇప్పుడు ఇలా స్విమ్ సూట్ లో ఫొటోస్ పెట్టడంతో కొంతమంది నెటిజన్స్ మీకు పెళ్లి అయింది, ఇలాంటి బట్టలు వేస్తారా??, ఇలా చేసినందుకు మీ భర్త మీకు విడాకులు ఇవ్వరా?? అని ప్రశ్నలు వేస్తున్నారు. వీటికి ఈ హాస్య నటి ఘాటుగా సమాధానం ఇచ్చింది.

Sanjana Galrani : రోడ్డుపై క్యాబ్ డ్రైవర్ తో గొడవ పడిన హీరోయిన్.. ఒకరిపై ఒకరు పోలీసులకి ఫిర్యాదు..

ఈ ప్రశ్నలు అడిగే వాళ్ళు ఇంకా 1920ల్లో ఉన్నారు. ఇది 2021 ఇప్పటికైనా మేలుకోండి. మీరు ఇలా నెగిటివ్ కామెంట్స్ చేయడం ప్రాబ్లమ్ కాదు. మీ ఆలోచనా విధానం ఇలా ఉండటం ప్రాబ్లం. ఇప్పటికైనా మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోండి. నా భర్త నుంచి నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఇలాంటి మాటలు పట్టించుకోవద్దు అని ఆయనే చెప్పాడు. ఆయన డైవర్స్ ఇవ్వరు మీరు ఎక్కువగా ఆలోచించొద్దు అని పోస్ట్ చేశారు. ఇలా ఇంత చీప్ గా ఆలోచించే మీరంతా అమ్మాయిల్ని వాళ్ళ లైఫ్ ని వాళ్ళని బతకనివ్వండి చాలు అని సీరియస్ గా స్పందించింది.