Kannur – Bengaluru : రైలుపై విరిగిపడ్డ కొండచరియలు

కన్నూరు నుంచి బెంగళూర్ వెళ్తున్న తరుణంలో బెంగళూరు డివిజన్‌లోని తొప్పూరి-శివ్డీ ఘాండ్‌ మధ్య రైలు వెళ్తున్న సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి.

Kannur – Bengaluru : రైలుపై విరిగిపడ్డ కొండచరియలు

kannur - bangalore

Kannur – Bengaluru : కన్నూరు – బెంగళూర్ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది. కన్నూరు నుంచి బెంగళూర్ వెళ్తున్న తరుణంలో బెంగళూరు డివిజన్‌లోని తొప్పూరి-శివ్డీ ఘాండ్‌ మధ్య రైలు వెళ్తున్న సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ఊహించని ఈ ప్రమాదంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు.

చదవండి : Secunderabad Railway Station : అరగంట పార్కింగ్ ఫీజు రూ.500.. నిబంధనల ప్రకారమే అంటున్న అధికారులు

తెల్లవారు జామున 3గంటల 50నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో రైల్లో మొత్తం 2348 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఇక ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. అందరు సురక్షితమే అని అధికారులు తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

చదవండి : Hyderabad Metro Rail : హైదరాబాద్ లో ఉదయం గం.6 నుంచే మెట్రో రైలు సేవలు

కొండకు, రైలు మధ్య రాళ్ళూ ఇరుక్కుపోవడంతో రైల్వే సిబ్బంది వాటిని తొలగించేందుకు శ్రమిస్తున్నారు. రాళ్ళూ తొలగించి ట్రాక్ పనులు పునరుద్ధరించేందుకు సమయం పెట్టె అవకాశం ఉండటంతో.. ప్రయాణికులను బెంగళూరు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు రైల్వే అధికారులు. 15 బస్సులను ఏర్పాటు చేసి ప్రయాణికులను బెంగళూరు తరలిస్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా అల్పాహారం, తాగు నీరు అందించారు అధికారులు.

మొత్తం 2300 మంది ప్రయాణికులు ఉండటంతో మరో 10 బస్సులను ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి బెంగళూరుకి 130 కిలోమీటర్ల దూరం ఉంది.