Chiyaan Vikram: నిలకడగా విక్రమ్ ఆరోగ్యం

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఆసుపత్రిలో చేరాడనే వార్తతో కోలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనికి సంబంధించి సోషల్ మీడియా, మీడియా ఛానళ్లలో....

Chiyaan Vikram: నిలకడగా విక్రమ్ ఆరోగ్యం

Latest Update On Chiyaan Vikram Health

Chiyaan Vikram: తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఆసుపత్రిలో చేరాడనే వార్తతో కోలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనికి సంబంధించి సోషల్ మీడియా, మీడియా ఛానళ్లలో పలు రకాలుగా వార్తలు వస్తుండటంతో విక్రమ్‌కు ఏమైంది.. అసలు ఆయన ఆసుపత్రిలో ఎందుకు చేరారు.. ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారు.. అని ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన జూలై 7న అస్వస్థతకు గురయ్యాడని.. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారని తెలుస్తోంది.

Chiyaan Vikram: తమిళ్ హీరో విక్రమ్‌కు హార్ట్‌ఎటాక్.. కావేరీ ఆస్పత్రిలో చికిత్స

ఇక కావేరీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న విక్రమ్ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన ఆస్వస్థతకు గురవ్వడానికి గల కారణాలను తెలుసుకునేందుకు వైద్యులు పలు ఆరోగ్య పరీక్షలు చేశారని తెలుస్తోంది. ఇక ఈరోజు సాయంత్రం ఆయన్ను డిశ్చార్జ్ చేస్తారని, కొన్ని రోజులపాటు ఆయనకు విశ్రాంతి అవసరమని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నట్లుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

Chiyaan Vikram : విలన్‌గా విక్రమ్!..

ఇవాళ సాయంత్రం మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్-1 చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు నటుడు విక్రమ్ హాజరు కావాల్సి ఉండగా, ఇప్పుడు ఆరోగ్య సమస్య కారణంగా ఆయన ఈ ప్రోగ్రామ్‌కు రాలేకపోతున్నారు. అయితే విక్రమ్ నటించిన మరో సినిమా ‘కోబ్రా’కు సంబంధించిన ఈవెంట్‌ను జూలై 11న నిర్వహించనుండగా, ఈ ఈవెంట్‌కు విక్రమ్ హాజరవుతారని కోలీవుడ్ మీడియా చెబుతోంది. ప్రస్తుతానికి విక్రమ్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలియడంతో ఆయన అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.