Lava Blaze 5G : భారత్‌లో లావా బ్లేజ్ 5G ఫోన్ ఫస్ట్ టైం సేల్ మొదలైందోచ్.. వెంటనే కొనేసుకోండి..!

Lava Blaze 5G : ప్రముఖ దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీదారు లావా బ్లేజ్ 5G నవంబర్ 15 నుంచి భారత మార్కెట్లో ఫస్ట్ సేల్ ప్రకటించింది. హ్యాండ్‌సెట్ 7nm MediaTek డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇటీవలే భారత మార్కెట్లో లాంచ్ అయింది.

Lava Blaze 5G : భారత్‌లో లావా బ్లేజ్ 5G ఫోన్ ఫస్ట్ టైం సేల్ మొదలైందోచ్.. వెంటనే కొనేసుకోండి..!

Lava Blaze 5G goes on sale in India for first time Check price, offer details

Lava Blaze 5G : ప్రముఖ దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీదారు లావా బ్లేజ్ 5G నవంబర్ 15 నుంచి భారత మార్కెట్లో ఫస్ట్ సేల్ ప్రకటించింది. హ్యాండ్‌సెట్ 7nm MediaTek డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇటీవలే భారత మార్కెట్లో లాంచ్ అయింది. Blaze 5G ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 12పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీ బ్యాకప్‌తో వస్తుంది.

ధర ఎంతంటే? :
Lava Blaze 5G అధికారికంగా నవంబర్ 15 నుంచి మధ్యాహ్నం 12PM నుంచి అమెజాన్ ద్వారా సేల్ అందుబాటులో ఉండనుంది. హ్యాండ్‌సెట్ రూ. 10,999 ధరతో వస్తుంది. ప్రస్తుతం భారత మార్కెట్లో చౌకైన 5G స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా ఉండనుంది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా.. స్మార్ట్‌ఫోన్ రూ. 9,999 తగ్గింపు ధరకు అందుబాటులో ఉంటుంది. గ్లాస్ బ్లూ, గ్లాస్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో వస్తుంది.

Lava Blaze 5G goes on sale in India for first time Check price, offer details

Lava Blaze 5G goes on sale in India for first time

లావా బ్లేజ్ 5G స్పెసిఫికేషన్‌లు ఇవే :
Lava Blaze 5G 720×1600 పిక్సెల్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 4GB RAMతో పాటు ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 700 SoC ద్వారా పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో 3GB వర్చువల్ RAM సపోర్ట్ కూడా ఉంది. Lava నుంచి వచ్చిన ఈ హ్యాండ్‌సెట్ 128GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. దీనిని మైక్రో SD కార్డ్‌ని ఇన్‌స్టాల్ చేయడం ద్వారా మరింత విస్తరించవచ్చు. 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో వస్తుంది. ఆప్టిక్స్ కోసం.. 50MP ప్రైమరీ సెన్సార్, డెప్త్ కెమెరా, LED ఫ్లాష్‌తో కూడిన మాక్రో షూటర్‌ని కలిగి ఉంటుంది.

సెల్ఫీల కోసం.. ఫోన్ 8MP కెమెరాతో వస్తుంది. హ్యాండ్‌సెట్‌లో 5,000mAh బ్యాటరీ ఉంది. లావా నుంచి వచ్చిన స్మార్ట్‌ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంది. ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌కు సపోర్టు అందిస్తుంది. లావా బ్లేజ్ 5G 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. తయారీదారు 50 గంటల టాక్‌టైమ్, 25 రోజుల వరకు స్టాండ్‌బై టైమ్‌ను ఒకే ఛార్జ్‌పై అందజేస్తామని పేర్కొన్నారు. గత నెలలో జరిగిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2022 (IMC) సందర్భంగా లావా బ్లేజ్ 5Gని తొలుత కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రదర్శించారు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Google Play UPI : ఇండియాలో గూగుల్ ప్లేలో యూపీఐ ఆటోపే పేమెంట్ ఆప్షన్ వచ్చేసిందోచ్..!