Karate kalyani : నన్ను చంపాలని చూస్తున్నారు : కరాటే కళ్యాణి

తాజాగా తన ప్రాణానికి ముప్పు ఉందని, తనకు రక్షణ కల్పించాలంటూ కరాటే కల్యాణి నిన్న బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్ళే హత్య కేసులో సాక్ష్యాలు తారుమారు చేసి.....

Karate kalyani : నన్ను చంపాలని చూస్తున్నారు : కరాటే కళ్యాణి

Karate Kalyani

Karate kalyani :   ఇటీవల సినీ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణిపై జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్‌లో ఓ హత్య కేసుకు సంబంధించి సాక్షాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించినట్లు కేసు నమోదైంది. సింగరేణి కాలనీలో ఓ మైనర్ బాలికపై జరిగిన హత్య వివరాలను ఆవిడ బయట పెట్టడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు రావడంతో తూటంశెట్టి నితేష్ అనే వ్యక్తి రంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రైవేట్ కంప్లేంట్ దాఖలు చేయగా ఆమెపై కేసు నమోదు చేయాలని రంగా రెడ్డి కోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.

Hero : సంక్రాంతికి సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి ‘హీరో’

అయితే తాజాగా తన ప్రాణానికి ముప్పు ఉందని, తనకు రక్షణ కల్పించాలంటూ కరాటే కల్యాణి నిన్న బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్ళే హత్య కేసులో సాక్ష్యాలు తారుమారు చేసి ఓ ప్రముఖ స్వచ్ఛంద సంస్థ కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేసిందని నేను బయట పెడుతున్నందుకు నాపై కక్ష కట్టి తనను హతమార్చాలని చూస్తున్నారని, తనకేమన్నా అయితే వాళ్ళే కారకులని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో బంజారాహిల్స్‌ పోలీసులు ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టారు.