Lightning Strikes: పిడుగుపడుతుండగా సెల్ఫీ తీసుకుంటున్న 19మంది మృతి
రాజస్థాన్ రాజధాని జైపూర్ లో పిడుగుపడి 9మంది చనిపోయారు. అమీర్ ప్యాలెస్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో టవర్ వద్ద నిల్చొని సెల్ఫీలు తీసుకుంటున్న ఆరుగురు చనిపోయారు.

Lightining Strike (1)
Lightning Strikes: రాజస్థాన్ రాజధాని జైపూర్ లో పిడుగుపడి 9మంది చనిపోయారు. అమీర్ ప్యాలెస్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో టవర్ వద్ద నిల్చొని సెల్ఫీలు తీసుకుంటున్న ఆరుగురు చనిపోయారు. పిడుగుపడిన సమయంలో టవర్ దగ్గర డజన్ల కొద్ది చనం ఉన్నట్లు సమాచారం.
చాలా మంది కంగారుతో దగ్గర్లోని అటవీ ప్రాంతానికి పరుగులు పెట్టారు. గాలింపు చర్యల్లో గల్లంతైన 29మందిని తీసుకురాగలిగారు పోలీసులు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల నష్టపరిహారం చెల్లించనున్నట్లు సీఎం అశోక్ గెహ్లాట్ ప్రకటించారు.
రాజస్థాన్ లో ఆదివారం చాలా ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. ఇండియా మెటరాలజికల్ డిపార్ట్‌మెంట్ సోమవారం ఉదయం వరకూ వర్షాలు పడతాయని సూచించింది.