Liquor Shops : నో లిక్కర్, మందుబాబుల కష్టాలు..సరిపడా స్టాక్ ఉంచాలన్న సర్కార్!

నూతన మద్యం పాలసీ తీసుకరానుంది. దీంతో సెప్టెంబర్ 30వ తేదీ నుంచి ప్రైవేటు లిక్కర్ షాపులను మూసివేయాలని సూచించింది. కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే లిక్కర్ షాపులు తెరుచుకోనున్నాయి.

Liquor Shops : నో లిక్కర్, మందుబాబుల కష్టాలు..సరిపడా స్టాక్ ఉంచాలన్న సర్కార్!

Delhi

Delhi Govt : మందుబాబులు అష్టకష్టాలు పడుతున్నారు. తమకు నచ్చిన బ్రాండ్ దొరకపోతుండడంతో తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. ఆ బ్రాండ్ తెచ్చుకోవడానికి కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు. సరియైన స్టాక్ లేదని, దీంతో చాలా చోట్ల మద్యం లభించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. చాలా వరకు స్టాక్ అయిపోయిందని, మద్యం కోసం దూర ప్రాంతాలకు వెళుతున్నారని తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. సరిపడా స్టాక్ నిల్వ ఉంచాలని సూచించింది.

Read More : Andhra Pradesh : వైద్యారోగ్యశాఖలో 14,200 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

ఈ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు. దేశ రాజధాని ఢిల్లీలో. ఎందుకంటే..అక్కడ నూతన మద్యం పాలసీ తీసుకరానుంది. దీంతో సెప్టెంబర్ 30వ తేదీ నుంచి ప్రైవేటు లిక్కర్ షాపులను మూసివేయాలని సూచించింది. కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే లిక్కర్ షాపులు తెరుచుకోనున్నాయి. ముందే సమాచారం రావడంతో..మందుబాబులు అలర్ట్ అయ్యారు. మద్యాన్ని ముందే కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు. కొద్ది రోజులే ఉండడంతో కొన్ని దుకాణాల్లో సరిపడా స్టాక్ లేదని తెలుస్తోంది. నవంబర్ 17 వరకు షాపులు తెరుచుకొనే పరిస్థితి లేదు. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే..రానున రోజుల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందోనని మందుబాబులు ఆందోళన చెందుతున్నారంట.

Read More : Love Marriage : ప్రేమపెళ్లి యువకుడి ప్రాణం తీసింది
తూర్పు ఢిల్లీలోని వికాస్ మార్గ్ లో ఓ ప్రైవేటు మద్యం దుకాణంలో అనేక మంది మద్యం ప్రియులు ఖాళీ చేతులుతో వెళుతున్నారంట. కేవలం బీర్ మాత్రమే ఉందని మద్యం విక్రయించే వాళ్లు వెల్లడిస్తున్నారని సమాచారం. నిల్వలు తగ్గిపోతున్నందున తాము ఏమి చేయలేకపోతున్నామని, ప్రభుత్వ నిర్ణయం తర్వాత..రీ స్టాక్, ఆర్డర్ లు ఇవ్వడం మానేసినట్లు ఓ మద్యం దుకాణ యజమాని ఓ జాతీయ పత్రికకు వెల్లడిస్తున్నారు. ప్రభుత్వ విక్రయాల నుంచి రిటైల్ విక్రయాలను బలోపేతం చేయడం ద్వారా..మద్యం కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎక్సైజ్ శాఖ సీనియర్ అధికారి వెల్లడిస్తున్నారు. ప్రైవేటు దుకాణాలు మూసివేయడం వల్ల…దాదాపు 3 వేల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోతారని ఢిల్లీ లిక్కర్ సేల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమిత్ శర్మ..తెలిపారు.

Read More :Zion Clark : రెండు చేతులతో అత్యంగా వేగంగా పరుగెత్తుతాడు..గిన్నిస్ రికార్డు

కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం ఢిల్లీని 32 జోన్లుగా విభజించి లైసెన్స్ ల కేటాయింపు ప్రక్రియ పూర్తయిందని డిప్యూటీ సీఎం మనోష్ సిసోడియా ఇదివరకే వెల్లడించారు. కొత్త పాలసీ కింద నవంబర్ 17 నుంచి ఢిల్లీలో షాపులు తెరబడుతాయని, ఈ సమయంలో అక్టోబర్ 01 నుంచి ప్రైవేటు మద్యం షాపులను మూసివేయనున్నట్లు తెలిపారు. ఢిల్లీలో ప్రస్తుతం 720కి పైగా మద్యం షాపులు ఉన్నట్లు అంచనా. ఇందులో 260 ప్రైవేటు, 460 ప్రభుత్వ మద్యం దుకాణలున్నాయి. మద్యం షాపుల లైసెన్స్ లను ప్రభుత్వం పొడిగించింది. సెప్టెంబర్ 30 తర్వాత లైసెన్స్ లను జారీ చేయలేదు. అక్టోబర్ 01 నుంచి మొత్తం 260 మద్యం దుకాణాలు తెరుచుకోవు. వీటి మూసివేతతో 47 రోజుల పాటు ఢిల్లీలోని ప్రభుత్వ దుకాణాల్లో మాత్రమే మద్యం విక్రయించబడుతుంది.