Telangana Lockdown : తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపు ?

లాక్ డౌన్ మరికొన్ని రోజులు పొడిగించాలనే అనే దానిపై తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. మరో వారం రోజులు పొడిగిస్తే..కరోనాను పూర్తిగా కంట్రోల్ చేయవచ్చని భావిస్తోందని సమాచారం.

Telangana Lockdown : తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపు ?

Tg Lockdown

Updated On : May 24, 2021 / 3:51 PM IST

Lockdown Extension : తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 31వ తేదీ వరకు ఈ లాక్ డౌన్ అమల్లో ఉంటుందనే సంగతి తెలిసిందే. 24 గంటల్లో కేవలం 4 గంటలు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ప్రజలను అనుమతినిస్తున్నారు. అనంతరం లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు.



ఈ కారణంగా..వైరస్ వ్యాప్తి చెందడం లేదు. అంతేగాకుండా..పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నాయి. ఇంకా తగ్గాలంటే..లాక్ డౌన్ మరికొన్ని రోజులు పొడిగించాలనే అనే దానిపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. మరో వారం రోజులు పొడిగిస్తే..కరోనాను పూర్తిగాా కంట్రోల్ చేయవచ్చని భావిస్తోందని సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు, ఇతర పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష జరుపనున్నారు. లాక్ డౌన్ పొడిగింపుపై కీలక నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉంది.



Read More : TCS CodeVita: ప్రపంచంలోనే అతి పెద్ద ప్రోగ్రాంతో గిన్నీస్ రికార్డు సాధించిన టీసీఎస్