Mythri Movie Makers : సల్మాన్ ఖాన్‌తో లోకేష్ కనగరాజ్ సినిమా.. టాలీవుడ్ నిర్మాతలతో??

హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న సల్మాన్ ఖాన్ ని లోకేష్ కనగరాజ్ కలవడం, స్టోరీలైన్ వినిపించడం జరిగింది. గతంలో సల్మాన్ ఖాన్.. లోకేష్ విజయ్ తో చేసిన మాస్టర్ మూవీని బాలీవుడ్ లో............

Mythri Movie Makers : సల్మాన్ ఖాన్‌తో లోకేష్ కనగరాజ్ సినిమా.. టాలీవుడ్ నిర్మాతలతో??

Lokesh Kanagaraj

Salman Khan :  సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో బిజీ బిజీగా సినిమాలు చేస్తూనే తెలుగులో గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవితో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. అలాగే వెంకటేష్ ని తన సినిమాలో రోల్ చేయిస్తున్నారు. తన షూటింగ్స్ కూడా హైదరాబాద్ లోనే చేస్తున్నారు. ఇలా టాలీవుడ్ మీద తన ప్రేమని అన్ని రకాలుగా చూపిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ నిర్మాతలతో సినిమా చేయబోతున్నట్టు సమాచారం. హిందీ హీరో.. తమిళ్ డైరెక్టర్.. కలిసి చేస్తున్న ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తోంది మైత్రి మూవీ మేకర్స్.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హిందీలో టైగర్ 3, కభీ ఈద్ కభీ దివాలి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆల్రెడీ 2 సినిమాలు చేస్తున్న సల్మాన్ తెలుగులో చిరంజీవితో గాడ్ ఫాదర్ మూవీ చేస్తున్నారు. ఇప్పుడు సౌత్ కి చెందిన క్రేజీ డైరెక్టర్ తో సినిమా ఓకే చెయ్యబోతున్నారు. లేటెస్ట్ గా విక్రమ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో సినిమా చెయ్యబోతున్నారు సల్మాన్ అని తెలుస్తోంది.

Bollywood : మళ్ళీ ప్రేమలో పడుతున్న బాలీవుడ్ స్టార్లు..

హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న సల్మాన్ ఖాన్ ని లోకేష్ కనగరాజ్ కలవడం, స్టోరీలైన్ వినిపించడం జరిగింది. గతంలో సల్మాన్ ఖాన్.. లోకేష్ విజయ్ తో చేసిన మాస్టర్ మూవీని బాలీవుడ్ లో రీమేక్ చేద్దామనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ రీమేక్ సెట్స్ మీదకు రాలేదు. కానీ లోకేష్ సినిమాల మీద సల్మాన్ ఖాన్ ఇంట్రస్ట్ అలాగే ఉంది. దాంతో లోకేష్ తో కలిసి సినిమా ప్లాన్ చేస్తున్నారు సల్మాన్.

మైత్రి మూవీస్ గతంలోనే లోకేష్ కి అడ్వాన్స్ ఇచ్చి ఉంది. అయితే అది రామ్ చరణ్ సినిమా కోసం ఇచ్చారు. కానీ లోకేష్ చెప్పిన కథ చరణ్ కి నచ్చకపోవడంతో అది మొదట్లోనే ఆగిపోయింది. దీంతో లోకేష్, సల్మాన్ ని కలిపేసి సినిమా చేద్దామని ఫిక్స్ అయిపోయారు మైత్రి మూవీస్. లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం విజయ్ తోనే మరో మూవీ చేస్తున్నారు. సల్మాన్ కూడా 2 సినిమాలతో బిజీగా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఫ్రీ అవ్వగానే ఈ సినిమా లైన్ లో పెట్టాలని భావిస్తున్నారు. అయితే దీనిపై అధికారిక సమాచారం ఇంకా రాలేదు.