Bollywood : మళ్ళీ ప్రేమలో పడుతున్న బాలీవుడ్ స్టార్లు..

బాలీవుడ్ లో లవ్ సెకండ్ ఇన్నింగ్స్ సీజన్ స్టార్ట్ అయ్యింది. ఒకరి తర్వాత ఒకరు బ్రేకప్స్ తో పాటు కొత్త రిలేషన్స్ తో హాట్ టాపిక్ అవుతున్నారు. లేటెస్ట్ గా..........

Bollywood : మళ్ళీ ప్రేమలో పడుతున్న బాలీవుడ్ స్టార్లు..

Bollywood

Bollywood :  లేటు వయసులో ఘాటు ప్రేమలో మునిగి తేలుతున్నారు బాలీవుడ్ స్టార్లు. అయినా ప్రేమలో పడడానికి వయసుతో పనేముంది అంటూ లవ్ లైఫ్ ని కంటిన్యూ చేస్తున్నారు. అసలు ఎవ్వరూ ఎక్స్ పెక్ట్ చెయ్యని బ్రేకప్ లతో, అంతకుమించి సెన్సేషనల్ రిలేషన్స్ తో లవ్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి హాట్ టాపిక్ అవుతున్నారు బాలీవుడ్ స్టార్లు.

బాలీవుడ్ లో లవ్ సెకండ్ ఇన్నింగ్స్ సీజన్ స్టార్ట్ అయ్యింది. ఒకరి తర్వాత ఒకరు బ్రేకప్స్ తో పాటు కొత్త రిలేషన్స్ తో హాట్ టాపిక్ అవుతున్నారు. లేటెస్ట్ గా ఒకప్పటి టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఇలియానా రెండో సారి ప్రేమలో పడినట్టు న్యూస్ వైరల్ అవుతోంది. అంతకుముందు ఆండ్రూ నీబోస్ తో రిలేషన్ లో ఉన్న ఈ గోవా బ్యూటీ తర్వాత బ్రేకప్ చెప్పేసి సింగిల్ స్టేటస్ మెయింటెన్ చేసింది. అయితే లేటెస్ట్ గా కత్రినా కైఫ్ తమ్మడు సెబాస్టియన్ లారెంట్ తో లవ్ లో ఉన్నట్టు టాక్ నడుస్తోంది. ఇటీవల కత్రినా బర్త్ డే సెలబ్రేషన్స్ లో ఇలియానా కూడా ఉండడంతో మరోసారి ప్రేమలో పడిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

Aamir Khan : సినిమా రిలీజ్ అయి నాలుగేళ్లు.. హిట్ కొట్టి ఆరేళ్ళు .. ఈ సినిమాపైనే ఆశలు..

బాలీవుడ్ మరో హ్యాపెనింగ్ కపుల్ హృతిక్ రోషన్, సబా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. కొన్నాళ్ల నుంచి లవ్ ట్రాక్ నడుపుతున్న సబా, హృతిక్ పెళ్లి పీటలెక్కబోతున్నారంటూ న్యూస్ వైరల్ అవుతోంది. భార్య సుజానేతో విడాకులు తీసుకున్న హృతిక్ తనకంటే 20 ఏళ్లు చిన్నదైన సబా అజాద్ తో లవ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న ఈ ఇద్దరూ తమ ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళుతున్నారని, లైఫ్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారని బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతకుముందు బాలీవుడ్ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ హృతిక్ రోషన్ జాతకంలో రెండో పెళ్లి ఉందని చెప్పడంతో సబాతో పెళ్లి ఖాయమేనంటున్నారు ఫాన్స్.

 

అన్ ఎక్స్ పెక్టెడ్ లవ్ అనౌన్స్ మెంట్ తో షాకిచ్చింది బాలీవుడ్ సీనియర్ హీరోయిస్ సుస్మిత సేన్. లైఫ్ లో ముగ్గురితో డేటింగ్ చేసి పెళ్లి వరకూ వచ్చి ఆగిపోయిన సుస్మితా సేన్ లేటెస్ట్ గా ఐపిఎల్ సృష్టికర్త లలిత్ మోదీతో ప్రేమలో ఉన్నానంటూ సర్ ప్రైజ్ ఇచ్చింది. లలిత్ కన్నా ముందు తనకన్నా 15 ఏళ్లు చిన్న వాడైన రోహ్మత్ షాల్ తో 4 ఏళ్ళు లవ్ లైఫ్ ని లీడ్ చేసింది. కానీ 6నెలల క్రితం ఈ రిలేషన్ కి బ్రేక్ పడడడంతో లేటెస్ట్ గా లలిత్ తో మరోసారి లవ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది సుస్మిత. ఇలా చాలా మంది స్టార్లు ప్రేమలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నారు. మరి వాటిని పెళ్లి దాకా ఎంతమంది తీసుకెళ్తారో చూడాలి.