MAA Elections: ‘మా’ మసకబారిందని ఎలా అంటారు.. సీనియర్ నరేష్ సీరియస్!

టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలు గరంగరంగా సాగుతూ ట్విస్టుల మీద ట్విస్టులు తీసుకుంటున్నాయి. మోహన్ బాబు పెద్ద కుమారుడు, హీరో విష్ణుతో పాటు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పోటీకి దిగగా జీవితా రాజశేఖర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమా కూడా రంగంలోకి దిగడంతో ఈ ఎన్నికలు సినీ ప్రేక్షకులతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కూడా తనవైపుకు తిప్పుకొనేలా చేశారు.

MAA Elections: ‘మా’ మసకబారిందని ఎలా అంటారు.. సీనియర్ నరేష్ సీరియస్!

Maa President Actor Naresh Serous On Prakash Raj Comments

MAA Elections: టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలు గరంగరంగా సాగుతూ ట్విస్టుల మీద ట్విస్టులు తీసుకుంటున్నాయి. మోహన్ బాబు పెద్ద కుమారుడు, హీరో విష్ణుతో పాటు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పోటీకి దిగగా జీవితా రాజశేఖర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమా కూడా రంగంలోకి దిగడంతో ఈ ఎన్నికలు సినీ ప్రేక్షకులతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కూడా తనవైపుకు తిప్పుకొనేలా చేశారు. కాగా శుక్రవారం ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులను పరిచయం చేస్తూ మీడియా సమావేశం పెట్టి తన అభిప్రాయాలతో పాటు ఎన్నికలపై కూడా మాట్లాడారు.

ప్రకాష్ రాజ్ తో పాటు చిరంజీవి సోదరుడు నాగబాబు, నిర్మాత బండ్ల గణేష్ తో పాటు ప్రకాష్ రాజ్ టీం మొత్తం మాట్లాడారు. అయితే.. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ తనను నాన్ లోకల్ అనే విధంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అయితే.. ఈరోజు ఇదే ఎన్నికలపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సీనియర్ నటుడు, ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్ ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. అలాగే నాగబాబు చేసిన ఐదేళ్లుగా మా మసకబారిందనే వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పేనని ఖండించారు. మసకబారిందని సంస్థను కించపరచడం తప్పని అభిప్రాయపడ్డారు.

లోకల్.. నాన్ లోకల్ అనే అంశాన్ని మీరే తెరమీదకి తెచ్చారని.. అలా ప్రకాష్ రాజ్ ను ఎవరు అన్నారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తానూ ‘మా’లో ఆరు సంవత్సరముల నుంచి యాక్టివ్ గా వివిధ పదవులను నిర్వహించగా నరేష్ సినీ కుటుంబాల కోసం ఎప్పుడూ ముందు ఉంటామన్నారు. మూడు నెలలకు ముందే పోటీ చేస్తున్నట్టు ప్రకాష్ రాజ్ చెప్పారని.. మా ఒక రాజకీయ వ్యవస్థ కాదు.. ఎంతో మంది పెద్దలు దీన్ని నిర్మించారు.. కానీ ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలతో మేము చాలా భాధ పడ్డామని చెప్పారు.

మా మసక బారిందా లేక ముందుకు వెళ్లిందా అనేది వాళ్ళే తెలుసుకోవాలని.. ఇప్పటికీ మా ఎలక్షన్స్ ఏకగ్రీవంగా జరగాలి అని కోరుకుంటున్నానని చెప్పారు. మాలో 930 మందికి మెడికల్ ఇన్సూరెన్స్ చేసి.. వెయ్యి రూపాయలు వున్న పెన్షన్ ఆరు వేలు చేశామన్నారు. కరోనా టైంలో ‘మా’లో 87 మంది కొత్త సభ్యులు చేరగా కళ్యాణ లక్ష్మి, ఫించన్లు, ఆరోగ్యం కోసం ఇలా చాలా చాలా కార్యక్రమాలు చేశామన్నారు. సీసీసీకి కూడా లక్షరూపాయలు అందిస్తే అప్పుడు చిరంజీవి గారే అభినందించారన్నారు.

ఇప్పటికీ మా క్రమశిక్షణ సంఘం రిజైన్ చెయ్యమంటే మేము అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పిన నరేష్ మమ్మల్ని ఏమి చేయలేదు అని ఎందుకు హింసిస్తారని ప్రశ్నించారు. మహిళలకు అవకాశం ఇవ్వాలి అని క్రమశిక్షణ సంఘంకు సిఫార్స్ చేశానని.. ‘మా’ ఒక దిగ్గజం.. ‘మా’ని కూల్చడం ఎవ్వరి వల్ల కాదని కృష్ణంరాజు మీకు చెప్పమన్నారు. మా భవనం కోసం నేను సీఎం కేసీఆర్ గారిని కలిస్తే సాయం అందిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇక్కడ ప్రాణాలు గిల గిల కొట్టుకుంటుంటే మీరు ప్యానెల్ ను ఎలా ఎనౌన్స్ చేసారని ప్రకాష్ రాజ్ ను ప్రశ్నించారు.