Rs.1000 tea : చాయ్ రూ.1000..మన హైదరాబాద్ లోనే

ఒక్క చాయ్ ధర రూ.1000లు. ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే. ఈ టీ ఒక్కసారి తాగితే వన్ మోర్ కప్ అనటం ఖాయం అట. అంత టేస్ట్ గా ఉంటుందట.

Rs.1000 tea : చాయ్ రూ.1000..మన హైదరాబాద్ లోనే

One Tea Rs.1000 In H Yderabad (1)

One tea Rs.1000 In H yderabad : హైదరాబాద్. ఎన్నో ప్రత్యేక రుచులకు కేరాఫ్ అడ్రస్. ఇక్కడ ఇరానీ చాయ్ ఎంత ఫేమసో తెలిసిదే. పాత బస్తీలో ఇరానీ చాయ్ రుచి దేనికీ రాదు. ఒక్క కప్పు తాగితే వన్ మోర్ కప్ అనాల్సిందే. అంత రుచి ఇరానీ చాయ్ సొంతం. అలాగే మరో వినూత్న చాయ్ గురించి కూడా చెప్పుకోవాలి. అదే వెయ్యి రూపాయల చాయ్. అదేంటీ వెయ్యి రూపాయల చాయ్..దాని పేరా? అంటే కాదు ఒక్క చాయ్ ఖరీదు అక్షరాలా రూ.1000లు. అది కూడా మన హైదరాబాద్ లోనే. అవును మన హైదరాబాద్ లోనే. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. గమ్మత్తైన ఘుమఘుమలాడే సువాసన.. మైమరపించే రుచి..తాగిగే అద్భుతమైన అనుభూతి తప్పదంటున్నారు ఈ చాయ్ తయారు చేసేవారు.మరి ఆ వెయ్యి రూపాయల రుచిగల చాయ్ విశేషాలేంటో తెలిసేసుకుందాం..

ముదురు బంగారు వర్ణంలో ఆకట్టుకుంటుంది ఈ చాయ్. అంతేకాదు అన్ని చాయ్ ల్లాగా కాకుండా ఓ గమ్మత్తైన సువాసన దీని సొంతం ఇలాంటి విశేషణాలేవీ ఈ స్పెషల్‌ చాయ్‌ను వర్ణించడానికి సరిపోవు. అమోఘమైన చాయ్‌ తాగాలంటే..హైదరాబాద్‌లోని నిలోఫర్‌ కేఫ్‌కు వెళితే ఎంచక్కా చాయ్ సిప్‌ చేయొచ్చు. ఈ చాయ్‌ త యారీకి వినియోగించే పత్తా అత్యంత అరుదైనది.

Read more : కిలో టీ పొడి ధర రూ. 75 వేలు..

మొగ్గల నుంచి తయారయ్యే పొడి..
అస్సోంలోని బ్రహ్మపుత్ర నదీ తీరప్రాంతంమైజాన్‌ టీ తోటల్లో మాత్రమే లభిస్తుంది. మైజా న్‌ గోల్డెన్‌ టిప్స్‌గా పేరొందిన తేయాకు మొగ్గలు ఏడాదిలో ఎప్పుడో ఒకసారి మాత్రమే అత్యంత అరుదుగా లభిస్తాయి. వాటిని సూర్యోదయానికి ముందే అత్యంత జాగ్రత్తగా కోసిన ఆ మొగ్గలను ఆరబెట్టి, పొడిగా చేస్తారు. ఇలాంటి పొడి ఎప్పుడో ఒకసారి కిలో, కిలోన్నర మాత్రమే ఉత్పత్తి అవుతుంది. దీంతో ఈ పొడికి చాలా డిమాండ్ ఉంటుంది. ఈ పొడిని కొనుగోలు చేయటానికి ఎంత ధర అయినా పెడతారు వ్యాపారులు. అదేదో డబ్బులుంటే కొనేసుకంటే దక్కేది కాదు ఈ పొడి. వేలం ద్వారా కొనుక్కోవాల్సి ఉంటుంది.

Read more : కప్పు టీ రూ. 1000..! ఫైవ్ స్టార్ హోటల్లో కాదు రోడ్డు పక్కనే..!!

ఇలా తయారు చేసిన ఈ మొగ్గల పొడికి డిమాండ్‌ ఎక్కువ కాబట్టి వేలంద్వారా అమ్ముతారు. కోల్‌కతాలో నిర్వహించిన వేలంలో నిలోఫర్‌ కేఫ్‌ యజమాని బాబూరావు ఈ పొడిని రూ.75 వేలకు దక్కించుకున్నారు. దాని తో తయారుచేసిందే ఈ చాయ్‌.అందుకే దానికి రూ.1000ల ధర.హా అన్నట్లు టీ అంటే పాలు పోసి కాస్తారు కదా..ఈ విషయం అందరికి తెలసిందే. కానీ ఈ టీలో పాలు ఏమాత్రం వాడరు. టీ పొడి డికాషన్‌ రూపంలోనే మంచి టేస్ట్‌ ఉంటుందట. ఒక కప్పు టీ తయారీ కోసం 4 గ్రాముల మైజాన్‌ గోల్డెన్‌ టిప్స్‌ను వినియోగిస్తామని చెబుతున్నారు నిలోఫర్‌ కేఫ్‌ యజమాని అనుముల శశాంక్‌.

Read more : వామ్మో : కిలో టీ పొడి ధర రూ.40వేలు

తెలుసుకున్నారు కదూ..ఈ టీ తయారీ స్పెషల్.అంత అపురూపంగా తయారు చేస్తారు కాబట్టే ఈ టీ కి అంత ధర. కానీ ధర ఎక్కువైనా ఒక్కసారి టేస్ట్ చేస్తే డబ్బులు పెద్ద ఎక్కువ అనిపించదని పక్కా చెబుతున్నారు ఈ టీ అభిమానులు. మరి వెరైటీ టేస్టులు కోరుకునేవారు ఈ టీని ఒక్కసారి సిప్ చేయాలంటే హైదరాబాద్ నగరంలోని నిలోఫర్‌ కేఫ్‌ కు వెళ్లాల్సిందే.