కిలో టీ పొడి ధర రూ. 75 వేలు..

  • Published By: nagamani ,Published On : October 31, 2020 / 10:47 AM IST
కిలో టీ పొడి ధర రూ. 75 వేలు..

Assam :Kg tea rs.75000 : కిలో టీపొడి రేటు ఎంతుంటుంది? మహా ఐతే రూ.500 ఉంటుంది. కానీ టీ తోటలకు ప్రసిద్ది పొందిన అస్సోంలోని దిబ్రూగఢ్‌లో ఉన్న మనోహరి ఎస్టేట్‌లో పండిన టీపొడిని గువాహటి ‘‘టీ ఆక్షన్ సెంటర్’’ (జీటీఏసీ)లో జరిగిన వేలంలో కిలో టీపొడికి ఏకంగా రూ. 75 వేల ధర పలికింది. ఈ టీపొడి చాలా ప్రత్యేకమైనది. అందుకే అంత ధర పలికింది.


ఈ టీపొడిని ‘మనోహరి గోల్డ్ టీ’ అని పిలుస్తారు. ఇటువంటి ప్రత్యేకత కలిగిన టీ తోటలను ఎగువ అసోంలోని దిబ్రూగఢ్ జిల్లాలో మనోహరి టీ ఎస్టేట్‌లో పండిస్తారు. కరోనా కారణంగా చితికిపోయిన అసోం టీ ఇండస్ట్రీకి శుక్రవారం (అక్టోబర్ 30,2020)న పలికి వేలం ధర ఓ ఆశాకిరణంలా మారింది. ఈ మనోహరి గోల్డ్ టీ రూ.75వేల ధర పలకటంతో స్థానికి టీ వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.



https://10tv.in/mumbai-14years-old-boy-takes-selling-tea-help-sisters-attend-online-classes/
ఈ టీ ప్రత్యేకత గురించి మనోహరి టీ ఎస్టేట్ డైరెక్టర్ రాజన్ లోహియా మాట్లాడుతూ.. ఈ టీని అత్యుత్తమ రెండో ప్లష్ కల్నల్ టీ బడ్స్‌ నుంచి తయారు చేస్తామని..చాలా ప్రత్యేక వాతావరణంలో సేకరిస్తామని తెలిపారు. ప్రత్యేక వాతావరణం అంటే తెల్లవారుజామున సూర్యకాంతి ప్రసరించడానికి ముందే టీ ఆకుల్ని కోస్తామని తెలిపారు. ఈ టీపొడి మంచి సుగంధ పరిమళంతో నిండి ఉంటుంది.


ఈ ఆకులతో తయారు చేసిన టీ ప్రకాశవంతమైన పసుపు రంగులో ఉంటుంది. ఈ టీపొడిని కాంటెంపరరీ బ్రోకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ విక్రయించగా, గువాహటికి చెందిన టీ సంస్థ విష్ణు టీ కంపెనీ కొనుగోలు చేసింది. ఈ సంస్థ తమ డిజిటల్ ఈ-కామర్స్ వెబ్‌సైట్ 9ఏఎంటీడాట్‌కామ్ (9amtea.com) ద్వారా ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తోంది.


కాగా గతంలోనూ ఇటువంటి క్వాలిటీ గల కిలో టీపొడి రూ. 50 వేలకు అమ్ముడుపోయింది. ఇప్పుడు దాని రికార్డును అదే బద్దలుగొట్టి రూ.75వేల ధర పలికింది. గతేడాది ఆగస్టు 13న ఎగువ అసోంలోని డికోమ్ టీఎస్టేట్ తన ‘గోల్డెన్ బటర్‌ఫ్లై’టీకి గువాహటి టీ ఆక్షన్ సెంటర్‌లో కిలోకు రూ. 75 వేలు పలికి రికార్డు సృష్టించింది.