Monkeypox : కామారెడ్డిలో మంకీపాక్స్ కలకలం ?

కామారెడ్డి జిల్లాలో ఒక వ్యక్తికి మంకీ పాక్స్ లక్షణాలు రావటం కలకలం రేపింది.

Monkeypox : కామారెడ్డిలో మంకీపాక్స్ కలకలం ?

Monkeypox

Monkeypox : కామారెడ్డి జిల్లాలో ఒక వ్యక్తికి మంకీ పాక్స్ లక్షణాలు రావటం కలకలం రేపింది. కామారెడ్డిలోని  ఇందిరానగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి   జ్వరం.. దద్దుర్లు వంటి మంకీ ఫాక్స్ వ్యాధి లక్షణాలు వచ్చాయి. పదిరోజులుగా స్వల్ప జ్వరం లక్షణాలు ఉన్నప్పటికీ రెండు రోజుల క్రితం ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. నిన్న ఒంటి మీద దురదలు, దద్దర్లు రావటంతో  ఆవ్యక్తి స్దానిక గవర్నమెంట్ హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం వెళ్లాడు.

అతని రక్త నమూనాలను  వైద్యులు నిన్న  హైదరాబాద్‌లోని  ఫీవర్ ఆస్పత్రికి పంపించారు. అతడికి కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో  వైద్యులు చికిత్స అందించారు. అనతంరం ఆదివారం ఆ వ్యక్తిని  హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. ఈ వ్యక్తి జులై 6వ తేదీన  కువైట్ నుంచి ఇండియాకు వచ్చినట్లు సమాచారం.  కాగా ఇప్పటికే కేరళలో మూడు మంకీ పాక్స్ కేసులు నమోదు అయ్యాయి. ఈరోజు ఢిల్లీలో ఒక వ్యక్తి మంకీపాక్స్ నిర్ధారణ అయ్యింది.

Also Read : Monkeypox : మంకీ పాక్స్‌పై కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నత స్ధాయి సమావేశం