Tamil Nadu : పది రూపాయల కాయిన్స్ తో రూ.6 లక్షల కారు కొన్న తమిళ తంబి

ఇటీవలి కాలంలో  కిరాణా షాపుల్లోనూ, బస్సుల్లోనూ 10 రూపాయలు నాణేలు తీసుకోక పోవటంతో గొడవలు జరుగుతున్నాయి.  దాంతో ప్రజలు కూడా వారి వద్ద నుంచి 10 రూపాయల నాణేలు తీసుకోవటం మానేశారు. 

Tamil Nadu : పది రూపాయల కాయిన్స్ తో రూ.6 లక్షల కారు కొన్న తమిళ తంబి

Tamilnadu

Tamil Nadu : ఇటీవలి కాలంలో  కిరాణా షాపుల్లోనూ, బస్సుల్లోనూ 10 రూపాయలు నాణేలు తీసుకోక పోవటంతో గొడవలు జరుగుతున్నాయి.  దాంతో ప్రజలు కూడా వారి వద్ద నుంచి 10 రూపాయల నాణేలు తీసుకోవటం మానేశారు.  మొత్తంగా ప్రజలకు వీటి వల్ల గొప్ప చికాకు వచ్చి పడింది.

దీంతో తమిళనాడుకు  చెందిన ఒక వ్యక్తి 10 రూపాయల నాణేలు ఇచ్చి కారు కొనాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా 10 రూపాయల కాయిన్స్ కలెక్ట్ చేయటం మొదలెట్టాడు. నెలరోజుల్లో మొత్తం ఆరు లక్షల రూపాయలు  కలెక్ట్ చేసి కారుకొని వార్తల్లో నిలిచాడు.

New Project (24)

తమిళనాడులోని ఆరూర్ కు చెందిన వెట్రివేల్ అనే వ్యక్తి తల్లి దుకాణం నడుపుకుంటూ ఉంటుంది. అక్కడకు వచ్చే కస్టమర్లు 10 రూపాయల కాయిన్స్ తీసుకోవటం మానేశారు. దీంతో వారి వద్ద  చాలా పెద్ద మొత్తంలో 10 రూపాయల నాణేలు మిగిలి పోయాయి.  పిల్లలు కూడా 10 రూపాయల నాణేలు పనికి రానివని అనుకోవటం విన్నాడు.

New Project (25)

దీంతో ప్రజలకు అవగాహన కల్పించేందుకైనా 10 రూపాయల నాణేలతో కారు  కొనాలనుకుని నిర్ణయించుకున్నాడు. నెల రోజుల వ్యవధిలో  ఆరులక్షల రూపాయలకు సరిపడా 10 రూపాయల నాణేలు సంపాదించాడు. అవి  తీసుకుని వెళ్ళినప్పుడు కారు షాపు యజమాని కూడా ఆ నాణేలు తీసుకోటానికి అంగీకరించలేదు.  తర్వాత తాను ఎందుకు అలా కొంటున్నాడో వెట్రివేల్ వివరించేసరికి షాపు యజమాని కూడా అంగీకరించాడు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 10 నాణేలు విలువ లేనివి అని చెప్పనప్పుడు  బ్యాంకులు ఎందుకు స్వీకరించటం లేదని…. ఫిర్యాదు చేసినా ఎవరూ ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని వెట్రివేల్ అన్నాడు. తన బంధువులతో కలిసి 10 రూపాయల నాణేల బస్తాలను షాపులోకి తీసుకు వెళ్లగా అక్కడి సిబ్బంది వాటిని  లెక్కించి కారు తాళాలను వెట్రివేల్ కు అందచేశారు.

Also Read : Srinivasa Kalyanam : అమెరికాలో వైభవంగా ప్రారంభమైన శ్రీనివాస కళ్యాణాలు