Corona Positive : మంచు లక్ష్మికి కరోనా

మంచు లక్ష్మి కరోనా బారినపడింది. జలుబు, స్వల్ప జ్వరం ఉండటంతో టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్లు ఆమె తెలిపారు.

Corona Positive : మంచు లక్ష్మికి కరోనా

Corona Positive

Updated On : January 6, 2022 / 9:21 PM IST

Corona Positive : మంచు లక్ష్మి కరోనా బారినపడింది. జలుబు, స్వల్ప జ్వరం ఉండటంతో టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికంగా పోస్ట్ షేర్ చేశారు. సాధారణ జలుబు మాదిరిగా కరోనా మనల్ని వచ్చి చేరుతుందని, దానిని తట్టుకునేలా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని, విటమిన్ టాబ్లెట్స్ ను తీసుకోవాలని సలహా ఇచ్చింది. దాదాపు రెండు సంవత్సరాలుగా కరోనా బారి పడకుండా తప్పించుకున్నానని, ఆ దోబూచులాటలో చివరకు ఇప్పుడు దాని చేతికి చిక్కిపోయానని మంచు లక్ష్మీ తెలిపారు.

చదవండి : Manoj Manchu: మంచు మ‌నోజ్‌కు క‌రోనా పాజిటివ్

ఇదిలా ఉంటే గతేడాది డిసెంబర్ చివరి వారంలో మంచు మనోజ్ కరోనా బారిన పడ్డారు. ఆరోగ్యం బాగానే ఉన్నా, కొవిడ్ టెస్టు చేయించుకున్నప్పుడు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఇక ప్రస్తుతం మంచు లక్ష్మీ, మలయాళంలో మోహన్ లాల్ నటిస్తున్న ఓ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తోంది. అందుకోసం కలరీ యుద్ధ విద్యనూ ఆమె అభ్యసిస్తోంది. ఈ మధ్య కలరీ స్టిల్స్‌తో లక్ష్మి షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి.

చదవండి : Lakshmi Manchu: గాయాలపాలైన మంచు లక్ష్మి.. అసలేం జరిగిందంటే?

మంచు వారి ఇంటిలో మరో కొవిడ్ కేసు!