Prabhas: రెబల్ స్టార్‌తో మారుతీ.. హీరోయిన్‌గా అనుష్క ఫిక్స్?

కెరీర్ స్టార్టింగ్ నుంచి కమర్షియల్ హీరోగానే కంటిన్యూ అవుతున్నాడు ప్రభాస్. సినిమా సినిమాకి క్యారెక్టర్ వైజ్ వేరియేషన్, చూపిస్తున్నాడు డార్లింగ్. బాహుబలి సిరీస్ తర్వాత సాహో, రాధేశ్యామ్, బాహుబలితో అమాంతం పెరిగిన క్రేజ్...

Prabhas: రెబల్ స్టార్‌తో మారుతీ.. హీరోయిన్‌గా అనుష్క ఫిక్స్?

Prabhas

Prabhas: కెరీర్ స్టార్టింగ్ నుంచి కమర్షియల్ హీరోగానే కంటిన్యూ అవుతున్నాడు ప్రభాస్. సినిమా సినిమాకి క్యారెక్టర్ వైజ్ వేరియేషన్, చూపిస్తున్నాడు డార్లింగ్. బాహుబలి సిరీస్ తర్వాత సాహో, రాధేశ్యామ్, బాహుబలితో అమాంతం పెరిగిన క్రేజ్ ను సస్టెయిన్ చేయడానికి పరిమితం అవుతుంటే.. ఫ్యాన్స్ ప్రభాస్ నుంచి బిగ్గెస్ట్ సక్సెస్ ను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే, ఎవరి అంచనాలకు అందకుండా ఆ మధ్య మారుతి డైరెక్షన్ లో రాజా డీలక్స్ అనే సినిమా చేయనున్నట్లు ప్రచారం మొదలైంది.

Prabhas: సోలోగా కానిచ్చేస్తున్న ప్రభాస్..?

టైటిల్ తో సహా వచ్చిన సోషల్ మీడియా న్యూస్ అప్పుడే ఫ్యాన్స్ ను ఒకింత కలవర పెట్టినా, మారుతి స్టయిల్ ఆఫ్ కామెడి టైమింగ్ తో సినిమా ఇలా ఉంటుంది, అలా ఉంటుందని చర్చించుకున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. కాగా.. ఇప్పుడు ఈ సినిమాపై జరుగుతున్న చర్చ ప్రకారం.. భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారట. ఆ ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరు అనుష్క శెట్టి అని గతంలోనే ప్రచారం జరగగా.. ఆ రూమర్ నిజమేనని ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Prabhas: మరో నెల రెస్ట్ మోడ్‌లోనే ప్రభాస్.. అసలేం జరుగుతోంది?

ఇప్పటికే మారుతీ అనుష్కతో చర్చలు కూడా జరపగా.. మిగతా ఇద్దరు హీరోయిన్స్ కోసం మేకర్స్ హంటింగ్ మొదలు పెట్టారట. ప్రభాస్-అనుష్క హిట్ కాంబినేషన్. బాహుబలి తర్వాత ఈ ఇద్దరు కలిసి నటిస్తే చూడాలని డార్లింగ్ అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నారు. అందుకు తగ్గట్లే మారుతీ ఈ కాంబినేషన్ సెట్ చేసి సినిమాకు హైప్ తీసుకొచ్చే పనిలో ఉన్నాడట. అయితే.. ఈ సినిమా మొదలయ్యేది ఎప్పుడు.. ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించేదెప్పుడు అన్నది స్పష్టతలేదు.