Omicron Variant : ఒమిక్రాన్, డెల్టా కంటే వేగంగా వ్యాప్తి చెందుతోంది-కేంద్ర మంత్రి

ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా రకం కంటే ఎక్కువ  వేగంగా వ్యాప్తి చెందుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి డా. భారతి పవార్ చెప్పారు.

Omicron Variant : ఒమిక్రాన్, డెల్టా కంటే వేగంగా వ్యాప్తి చెందుతోంది-కేంద్ర మంత్రి

Dr.Bharati P.Pawar

Omicron Variant : ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా రకం కంటే ఎక్కువ  వేగంగా వ్యాప్తి చెందుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి డా. భారతి పవార్ చెప్పారు. ఈరోజు పార్లమెంట్ లో ఒమిక్రాన్ వేరియంట్ పై  పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె రాత పూర్వత సమాధానం ఇచ్చారు. ఒమిక్రాన్ తీవ్రత అంచనా వేసేందుకు మరింత అధ్యయనం జరపాల్సి ఉందని మంత్రి ఆన్నారు. ఒమిక్రాన్‌పై వ్యాక్సిన్లు ఎంతవరకు పనిచేస్తాయనేందుకు ఇంతవరకు స్పష్టమైన ఆధారాలు లేవన్నారు.

ఒమిక్రాన్ రకాన్ని గుర్తించడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆర్టీ-పీసీఆర్ టెస్టును వినియోగించవచ్చని ఐసీఎంఆర్ ఆమోదించిందని… ఒమిక్రాన్   వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలపై మార్గదర్శకాలు జారీ చేశామని తెలిపారు. ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా గుర్తించిన దేశాలను రిస్క్ దేశాలుగా వర్గీకరించామని… ఈ జాబితా కేసుల సంఖ్యను బట్టి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందని ఆమె వివరించారు.
Also Read : Omicron : తెలంగాణలో 9కి చేరిన ఒమిక్రాన్ కేసులు..హన్మకొండ మహిళకు వైరస్
ఒమిక్రాన్ ముప్పు ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడు దేశానికి చేరుకున్న సమయంలో ఆర్టీ-పీసీఆర్ టెస్టు, ఆ తర్వాత 7 రోజులు  క్వారంటైన్‌లో తప్పనిసరిగా ఉండేలా ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. ఆర్టీ-పీసీఆర్ టెస్టులో పాజిటివ్ వచ్చిన వారి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నిర్ధారించిన ల్యాబ్‌లకు ఒమిక్రాన్ గుర్తింపు కోసం పంపిస్తున్నాం. సంబంధిత మంత్రిత్వశాఖలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నాం అని ఆమె చెప్పారు.

పోర్టులు, విమానాశ్రయాల వద్ద కఠినమైన స్క్రీనింగ్ నిర్వహించడం, అనుమానిత, నిర్థారిత కేసులను ఆస్పత్రికి తరలించడంపై ఆదేశాలిచ్చామని మంత్రి వివరించారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పర్యవేక్షిస్తున్నామని మంత్రి  భారతి పవార్ పార్లమెంట్ లో తెలిపారు.