Harish Rao fire On PM Modi : తెలంగాణ విభజనపై ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం..

తెలంగాణ విభజనపై ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మోడీ తెలంగాణ ప్రజలను అవమానపరుస్తున్నారని..ధ్వజమెత్తారు.

Harish Rao fire On PM Modi : తెలంగాణ విభజనపై ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం..

Harish Rao Fire On Pm Modi

Minister Harish Rao Counter Attack On PM Modiతెలంగాణ ప్రజలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవమానించారని మంత్రి హరీష్‌ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ దళితబంధు అవగాహన సదరస్సులో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..పార్లమెంట్ లో ప్రధాని మోడీ తెలంగాణ విభజన విషయంలో చేసిన వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా మోడీ ఏమేమో మాట్లాడుతున్నారనా..తెలంగాణ విభజన జరిగి ఏడేళ్లు అయినా ఈనాటికి విభజన హామీలు అమలు చేయకుండా వీలు తెలంగాణ ప్రజలను ప్రధాని మోడీ అవమానించేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

Also read : PM Modi : స్వార్ధరాజకీయల కోసమే ఏపీని హడావిడిగా విభజించారు..తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని కీలక వ్యాఖ్యలు..

తెలంగాణపై మొదట్నుంచి బీజేపీకి ప్రేమ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇంతమంది బలిదానాలకు కాంగ్రెస్‌, బీజేపీ కారణం కాదా? అని ప్రశ్నించారు హరీశ్ రావు. 2004లోనే తెలంగాణ ఇచ్చి ఉంటే అంత మంది చనిపోయేవారా? అని ఆవేదన వ్యక్తంచేస్తు నిలదీశారు. ఏడేళ్లయినా విభజన హామీలు ఎందుకు నెరవేర్చలేదు? అని ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ నేతలకు మాత్రం ఇవేమీ పట్టవని ఇపప్పటికైనా రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని, తెలంగాణపై ఇంత చిన్నచూపు ఎందుకు అని మండిపడ్డారు. ఉత్తర భారతానికి ఒకనీతి, దక్షిణ భారతానికి ఒక నీతా?మోదీ ఉత్తరభారతానికి మాత్రమే ప్రధానా? అని ప్రశ్నించారు.

Also read : Andhra Pradesh Bifurcation: ఏపీ విభజనలో కాంగ్రెస్ అధికార గర్వమే కనిపించింది – ప్రధాని మోదీ

ఉమ్మడి ఏపీని కాంగ్రెస్ పార్టీ హడావుడిగా విభజించిందంటూ ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం (ఫిబ్రవరి 8,2022) రాజ్యసభలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విభజనపై మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉమ్మడి ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందంటూ విమర్శించారు. తెలంగాణ‌కు తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని.. కానీ కాంగ్రెస్ అధికార గర్వం వ‌ల్ల ఏపీ-తెలంగాణ ఇంకా సమస్యలు ఎదుర్కుంటున్నాయని అన్నారు.

Also read : Pak Boy in India: ఎల్వోసీ ధాటి భారత్ లోకి వచ్చిన పాక్ బాలుడు, వెనక్కు పంపించాలంటూ కుటుంబ సభ్యుల వేడుకోలు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన సామరస్య పద్దతిలో జరగాల్సి ఉండేదని అన్నారు. విభజన చేసిన రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఓడిందని, తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్‌ను నమ్మలేదని అన్నారు. అందుకే రెండు రాష్ట్రాల్లోను కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందని ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే.