Minister KTR : నీ ప్రధాని మోదీ.. ఒక బ్రోకర్ అని నేను అనలేనా? బండి సంజయ్‌పై కేటీఆర్ ఫైర్
ప్రధాని మోదీ, అదానీకి బ్రోకర్ అని నేను అనలేనా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు వచ్చిన బీఎల్ సంతోష్ బ్రోకర్ కాదా?(Minister KTR)

Minister KTR : తెలంగాణలో అధికార బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సై అంటే సై అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి బీజేపీ నేతలు వాడిన కొన్ని పదాలను మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు. తీవ్ర స్థాయిలో ఎదురుదాడికి దిగారు. బండి సంజయ్ టార్గెట్ గా నిప్పులు చెరిగారు.
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై ఐటీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని బ్రోకర్ అని మాట్లాడుతున్నాడు. నేను కూడా అనలేనా? నీ ప్రధానమంత్రి మోదీ.. అదానీకి బ్రోకర్ అని నేను అనలేనా? కానీ అలా నేను అనను. మాకు సంస్కారం ఉంది. దేశమంతా అంటుంది. కానీ నేను అననను. బ్రోకర్, లోఫర్, లుచ్చా.. ఇలాంటి మాటలను అనడం మాకు రాదా? మాకు చేతగాదా? అని నిప్పులు చెరిగారు కేటీఆర్.(Minister KTR)
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలపై ఆయన ధ్వజమెత్తారు.
”తెలంగాణ పుట్టుకను అవమానించింది మోదీ కాదా? తెలంగాణను శత్రు దేశంగా చూస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని.. బండి సంజయ్ బ్రోకర్ అని అంటున్నారు.. ప్రధాని మోదీ, అదానీకి బ్రోకర్ అని నేను అనలేనా? కానీ అనను. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు వచ్చిన బీఎల్ సంతోష్ బ్రోకర్ కాదా? గుజరాత్ నేతల చెప్పులు మోసిన వ్యక్తి బండి సంజయ్. బండి సంజయ్ ఈ రాష్ట్రంలో పుట్టడం దురదృష్టకరం. తెలంగాణకు కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదు. లాభాలు అదానీకి, చందాలు బీజేపీకి, కష్టం మనకా?. దొంగ డబ్బుతో ప్రభుత్వాలు కూలుస్తున్నారు.(Minister KTR)
Also Read..MLA Jagga Reddy : అద్వానీ ప్రధాని కాకుండా మోడీ కుట్రలు చేశారు- ఎమ్మెల్యే జగ్గారెడ్డి
బీజేపీ ఒక్కటే ఉండాలి, అన్ని పార్టీలను చంపాలన్నదే మోదీ ఆలోచన. కరీంనగర్ కు ఏం చేశారో చెప్పాలని బండి సంజయ్ ను నిలదీయాలి. బీజేపీ ఎంపీ అరవింద్ ది ఫేక్ డిగ్రీ. టీఎస్ పీఎస్ సీ క్వశ్చన్ పేపర్ లీక్ వెనుక మేము ఉన్నామన్న ఆరోపణలు అవాస్తవం. గ్రూప్-1 పరీక్షలో జగిత్యాల జిల్లా నుంచి ఒక్కరే క్వాలిఫై అయ్యారు. ఒక్కో అభ్యర్థికి లక్ష రూపాయలు ఇవ్వాలన్న బండి సంజయ్ వ్యాఖ్యల్లో అర్థం ఉందా? గుజరాత్ లో పేపర్ లీక్ అయితే.. సీఎం కానీ మంత్రి కానీ రాజీనామా చేశారా? అని కేటీఆర్ ప్రశ్నించారు.(Minister KTR)