Minister KTR: భారతదేశం చూస్తోంది..! బీజేపీపై ట్విటర్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డ కేటీఆర్, కవిత ..

బిల్కిస్ బానో అత్యాచారం కేసులో దోషుల్లో ఒకరు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో స్టేజీ పంచుకున్న ఫొటోను ట్వీట్ చేస్తూ.. మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీజేపీ పై విమర్శలు గుప్పించారు.

Minister KTR: భారతదేశం చూస్తోంది..! బీజేపీపై ట్విటర్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డ కేటీఆర్, కవిత ..

ktr and kavitha

Minister KTR: భారతీయ జనతా పార్టీపై మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి విరుచుకుపడ్డారు. ట్విటర్ వేదికగా బీజేపీపై విమర్శలు చేశారు. బీజేపీ అంటే.. బలాత్కార్ జస్టిఫికేషన్ పార్టీ అంటూ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేయగా.. భారతదేశం చూస్తోంది..! అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్, కవితలు విమర్శలు చేయడానికి ఓ కారణం ఉంది. గుజరాత్‌లో శనివారం జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో బీజేపీ ప్రజాప్రతినిధులతో కలిసి బిల్కిస్ బానో కేసు దోషుల్లో ఒకరైన శైలేష్ చిమన్ లాల్ భట్ పాల్గొన్నారు.

Minister KTR : బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరుష పదాలతో ట్వీట్ చేస్తే అరెస్టు.. కానీ మేము సహిస్తున్నాం : మంత్రి కేటీఆర్

బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి దాహోద్ జిల్లా కర్మాడి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో అతడు వేదికను పంచుకున్నాడు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై బీజేపీయేతర పక్షాల నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీఎంసీ ఎంపీ మోయిత్రా స్పందిస్తూ ‘ బిల్కిస్ బానో యొక్క రేపిస్ట్ గుజరాత్‌లోని బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో వేదికను పంచుకున్నాడు. నేను ఈ రాక్షసులను తిరిగి జైలులో చూడాలనుకుంటున్నాను అని వ్యాఖ్యానించారు. భారతదేశం తన నైతిక దిక్సూచిని తిరిగి పొందాలని నేను కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు.

 

 

బిల్కిస్ బానో అత్యాచారం కేసులో దోషుల్లో ఒకరు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో స్టేజీ పంచుకున్న ఫొటోను ట్వీట్ చేస్తూ.. మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీజేపీ పై విమర్శలు గుప్పించారు. కవిత ట్వీట్ చేస్తూ.. ‘బిల్కిస్ బానో రేపిస్ట్ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో బహిరంగంగా వేదిక పంచుకుంటాడు. మహిళలపై క్రూరమైన నేరాలకు పాల్పడేవారికి న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటూ సంబరాలు చేసుకుంటున్న సమాజంగా మనం ఏమైపోయాం. భారతదేశం చూస్తోంది!’ అంటూ ట్వీట్ చేశారు.

 

 

మంత్రి కేటీఆర్ తన ట్వీట్‌లో ఫొటోను పోస్టు చేసి.. బీజేపీ అంటే.. బలాత్కార్ జస్టిఫికేషన్ పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. బిల్కిస్ బావో కేసు దోషులతో బీజేపీ నేతలు సన్నిహితంగా ఉండటం ఆ పార్టీ విధానాలను తెలియజేస్తుందని ట్వీటర్ వేదికగా బీజేపీపై విమర్శలు గుప్పించారు.