Minister KTR Davos : మంత్రి కేటీఆర్ దావోస్‌ పర్యటన..తెలంగాణకు పెట్టుబడుల వరద

అటు.. తెలంగాణలో నూతనంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు స్టాడ్లర్ రైల్ ముందుకు వచ్చింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో కంపెనీ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

Minister KTR Davos : మంత్రి కేటీఆర్ దావోస్‌ పర్యటన..తెలంగాణకు పెట్టుబడుల వరద

Ktr

Minister KTR visit Davos : దావోస్‌లో తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. రాష్ట్ర ఐటీ, ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి కేటీఆర్ కృషి ఫ‌లిస్తోంది. ప‌లు అంత‌ర్జాతీయ స్థాయి కంపెనీలు తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు సిద్ధమ‌య్యాయి. దాదాపు నెల క్రితమే హైదరాబాద్‌లో తన తొలి యూనిట్‌ను ప్రారంభించిన స్విట్జ‌ర్లాండ్‌కు చెందిన‌ ఫెర్రింగ్ ఫార్మా సంస్థ.. త‌న రెండో యూనిట్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. దావోస్ వేదిక‌గా ఈ నిర్ణ‌యాన్ని ప్రక‌టించింది. ఇందుకోసం రానున్న రెండు మూడేండ్లలో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడించింది.

అటు.. తెలంగాణలో నూతనంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు స్టాడ్లర్ రైల్ ముందుకు వచ్చింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో కంపెనీ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణలో ఉన్న మేదో సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, స్టాడ్లర్ రైల్ కలిసి ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని స్థాపించనున్నాయి. ఈ మేరకు స్టాడ్లర్ రైల్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు అన్స్ గార్డ్ బ్రోక్ మెతో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. రానున్న రెండేళ్లలో తెలంగాణలో వెయ్యి కోట్ల రూపాయలను రైల్వే కోచ్ ఫ్యాక్టరీ స్థాపన కోసం కంపెనీ పెట్టుబడిగా పెట్టనుంది.

Minister ktr: 20ఏళ్లలో కేటీఆర్ ప్రధాని కావొచ్చు..! మహిళా వ్యాపారవేత్త ప్రశంసలు

ఈ కంపెనీ ఫ్యాక్టరీ స్థాపన తర్వాత తయారుచేసే రైల్వే కోచ్‌లను కేవలం భారత దేశం కోసం మాత్రమే కాకుండా ఏషియా పసిఫిక్ రీజియన్ కోసం సైతం ఎగుమతి చేయనున్నట్లు తెలిపింది. ఫెర్రింగ్‌ ఫార్మా, స్టాడ్లర్ రైల్ కంపెనీలకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. పెట్టుబడులకు తెలంగాణ అనుకూలంగా ఉందని.. మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు రావాలంటూ ఆహ్వానించారు.