Minister Mallareddy: కుల రాజకీయాలు చేస్తున్నారు.. ఏపీ రాజకీయాలపై మంత్రి మల్లారెడ్డి హాట్ కామెంట్స్

ఏపీ రాజకీయాలపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడి నేతలు రాజకీయాలకే పరిమితం అవుతున్నారు. ప్రజలను పట్టించుకోవటం లేదని అన్నారు.

Minister Mallareddy: కుల రాజకీయాలు చేస్తున్నారు.. ఏపీ రాజకీయాలపై మంత్రి మల్లారెడ్డి హాట్ కామెంట్స్

Minister Mallareddy

Updated On : May 1, 2023 / 2:33 PM IST

Minister Mallareddy: ఏపీ రాజకీయాలపై మంత్రి మల్లారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో కుల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కేవలం అక్కడి నాయకులు రాజకీయాలకు పరిమితం అవుతున్నారని, ప్రజలను మాత్రం ఎవరూ పట్టించుకోవటం లేదని అన్నారు. రవీంద్రభారతిలో నిర్వహించిన మేడే వేడుకల్లో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ వల్లే హైదరాబాద్ కళకళలాడుతోందని కొనియాడారు. 2024లో కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ ప్రభుత్వమే వస్తుందని, మహారాష్ట్రలో కూడా వచ్చేది బీఆర్ఎస్ సర్కారేనని మంత్రి మల్లారెడ్డి జోస్యం చెప్పారు.

Supreme Court : విడాకులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. 6 నెలలు ఆగాల్సిన అవసరం లేదన్న ధర్మాసనం

ఏపీ రాజకీయాలపై మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడి నేతలు రాజకీయాలకే పరిమితం అవుతున్నారు. ప్రజలను పట్టించుకోవటం లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ నిర్మిస్తారని, విశాఖ ఉక్కును కూడా కేసీఆరే కాపాడతారని, ఆ సత్తా కేసీఆర్ కే ఉందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, ఇక్కడి కార్మికులకే కాకుండా దేశంలోని సుమారు 15 రాష్ట్రాలకు చెందిన కార్మికులు తెలంగాణలో ఉపాధి పొందుతున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ మాదిరిగా పరిపాలన చేయడం ఎవరి వల్లా కాదని మల్లారెడ్డి అన్నారు.

Karnataka Election 2023: కన్నడ ప్రజలపై బీజేపీ హామీల జల్లు.. ఎన్నికల మేనిఫెస్టో విడుదల

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందటానికి ప్రధాన కారణం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషేనని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి రూపాయి ఇస్తలేదని మల్లారెడ్డి ఆరోపించారు. పెద్దపెద్ద కంపెనీలను హైదరాబాద్‌కు తీసుకొచ్చి, ఇక్కడి యువతకు ఉపాధి కల్పిస్తున్న ఘనత మంత్రి కేటీఆర్‌ది అంటూ మల్లారెడ్డి కొనియాడారు.