RRR: ఆర్ఆర్ఆర్‌పై సీతక్క కామెంట్స్.. సూపర్ లాజిక్!

టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీగా వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా తొలి....

RRR: ఆర్ఆర్ఆర్‌పై సీతక్క కామెంట్స్.. సూపర్ లాజిక్!

Mla Seethakka Comments On Rrr Movie

RRR: టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీగా వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా తొలి
మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల కలెక్షన్లు రాబట్టి తన సత్తా చాటింది. స్టార్ డైరెక్టర్ రాజమౌళి, యంగ్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్‌ల కాంబో ఈ
సినిమాకు మేజర్ బలం కావడంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కట్టారు. ఇక ఈ సినిమాను పలువురు ప్రముఖులు కూడా వీక్షిస్తూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

RRR : రాజమౌళి బంగారం అంటూ పొగడ్తల వర్షం.. ‘ఆర్ఆర్ఆర్’పై ఆర్జీవీ వాయిస్..

కాగా ఈ సినిమాపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క చేసిన కామెంట్స్ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాను చూసిన సీతక్క, ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందంటూనే మరో సినిమా ‘ది కశ్మీర్ ఫైల్స్’పై విరుచుకుపడ్డారు. ‘‘దేశాన్ని ముక్కలుగా చేయాలనుకుంటే ది కశ్మీర్ ఫైల్స్ సినిమా చూడండి… దేశాన్ని ఏకం చేయాలనుకుంటే ఆర్ఆర్ఆర్ సినిమాను చూడండి’’ అంటూ సీతక్క చేసిన కామెంట్స్ ఇటు సినిమా వారితో పాటు రాజకీయ నాయకులను కూడా బాగా ఆకట్టుకున్నాయి.

RRR: కలెక్షన్స్‌పై ఆర్ఆర్ఆర్ టీం ఏమందంటే?

కేంద్ర ప్రభుత్వం అయిన బీజేపీ కశ్మీర్ ఫైల్స్ ను పలు రాష్ట్రాల్లో ట్యాక్ ఫ్రీ మూవీగా డిక్లేర్ చేస్తుండటంతో, ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని దేశవ్యాప్తంగా ట్యాక్ ఫ్రీ మూవీగా ప్రకటించాలని ఆమె ఈ సందర్భంగా కోరింది. ఇక రాజమౌళి ఈ సినిమాన అత్యద్భుతంగా తెరకెక్కించగా, తారక్, చరణ్‌ల పర్ఫార్మెన్స్ తనను ఆకట్టుకుందని సీతక్క అన్నారు. ఏదేమైనా సీతక్క చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. కొందరు సీతక్క చెప్పిన లాజిక్ సూపర్‌గా ఉందని ఆమెను పొగిడేస్తున్నారు.