Karnataka Polls: కాంగ్రెస్ పార్టీ నన్ను 91 సార్లు తిట్టింది.. స్వయంగా వెల్లడించిన ప్రధాని మోదీ

రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ను కూడా దుర్భాషలాడిన పార్టీ కాంగ్రెస్‌. నన్ను కాంగ్రెస్ దుర్భాషలాడుతుందని బాబాసాహెబ్ స్వయంగా చెప్పారు. బాబాసాహెబ్‌ను రాక్షసుడు, దేశ వ్యతిరేకి, ద్రోహి అని కాంగ్రెస్ నేతలు పిలిచేవారు. ఇవాళ మళ్లీ వీర్ సావర్కర్‌ను దూషిస్తున్నారు. కాంగ్రెస్ దూషణలకు పెద్ద పెద్ద మనుషులు బాధితులయ్యారు

Karnataka Polls: కాంగ్రెస్ పార్టీ నన్ను 91 సార్లు తిట్టింది.. స్వయంగా వెల్లడించిన ప్రధాని మోదీ

PM Modi at election rally in karnataka

Karnataka Polls: కాంగ్రెస్ పార్టీ తనను 91 సార్లు తిట్టిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుర్తు చేశారు. అయితే గతంలో బాబాసాహేబ్ అంబేద్కర్, ఇప్పుడు సావర్కర్‭లను కాంగ్రెస్ నేతలు దూషించారని, వారి అనంతరం తనను దూషిస్తుంటే బహుమతిగా భావిస్తున్నానని అన్నారు. కర్ణాటకలోని బీదర్ జిల్లా హుమ్నాబాద్‌లో శనివారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభం కాగానే కాంగ్రెస్ నేతలు తనపై దుర్భాషలాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ నేతలు సుపరిపాలనపై ఇంత శ్రద్ధ పెట్టి ఉంటే, కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం పెంచేందుకు ఆ పని చేసి ఉంటే, నేడు కాంగ్రెస్‌కు ఇంతటి దుస్థితి వచ్చేది కాదని ప్రధాని మోదీ అన్నారు. దేశాభివృద్ధికి పాటుపడిన వారిని దుర్భాషలాడిన చరిత్ర కాంగ్రెస్‌దేనన్నారు.

Man Fathered 550 Children : 550 మంది పిల్లలకు తండ్రి అయిన వ్యక్తికి షాకిచ్చిన కోర్టు .. రూ.కోటి జరిమానా

‘‘రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ను కూడా దుర్భాషలాడిన పార్టీ కాంగ్రెస్‌. నన్ను కాంగ్రెస్ దుర్భాషలాడుతుందని బాబాసాహెబ్ స్వయంగా చెప్పారు. బాబాసాహెబ్‌ను రాక్షసుడు, దేశ వ్యతిరేకి, ద్రోహి అని కాంగ్రెస్ నేతలు పిలిచేవారు. ఇవాళ మళ్లీ వీర్ సావర్కర్‌ను దూషిస్తున్నారు. కాంగ్రెస్ దూషణలకు పెద్ద పెద్ద మనుషులు బాధితులయ్యారు. బాబాసాహెబ్‌, వీర్‌ సావర్కర్‌లా కాంగ్రెస్‌ నన్ను దుర్భాషలాడుతుంటే.. దానిని బహుమతిగా భావిస్తున్నాను. వాళ్లు దుర్భాషలాడుతూనే ఉన్నారు కానీ నేను మాత్రం ప్రజా సేవకే నా సమయాన్ని వెచ్చిస్తాను. మీ ఆశీస్సులతో అక్రమాలన్నీ మట్టిలో కలిసిపోతాయి. ఈరోజు బీదర్ నుంచి మాట్లాడటం నాకు ఆనందంగా ఉంది. నేను ప్రధానమంత్రి పదవికి అభ్యర్థిని అయినప్పుడు కూడా బీదర్ ఆశీర్వాదం పొందాను’’ అని అన్నారు.

Bihar: ధీరేంద్ర శాస్త్రీని జైలులో వేయాలి.. బిహార్ ఆర్జేడీ చీఫ్ వివాదస్పద వ్యాఖ్యలు

క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన ఎన్నిక‌లు 5 సంవ‌త్స‌రాల పాటు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికే కాద‌ని, ఆ రాష్ట్రాన్ని దేశంలోనే నంబ‌ర్ 1గా నిలప‌డానికే అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశ కలను సాకారం చేయడంలో కర్ణాటక పాత్రను ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయని ప్రధాని అన్నారు. కర్ణాటకలో నిజమైన అభివృద్ధిని సాధించడానికి, డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని కొనసాగించడం చాలా అవసరమని అన్నారు. డబుల్ ఇంజిన్, డబుల్ పవర్ ఉన్న అలాంటి ప్రభుత్వం మాత్రమే కర్ణాటకను నంబర్ వన్‌గా చేయగలదని అన్నారు. ఒకవైపు హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు విస్తరిస్తూనే, మరిన్ని జిల్లాలకు మెట్రో సౌకర్యాలు విస్తరించి, ‘వందే భారత్’ వంటి ఆధునిక రైళ్లు ఎక్కువ సంఖ్యలో నడిచే విధంగా, ప్రతి పొలంలో ఆధునిక నీటిపారుదల వ్యవస్థలను ఏర్పాటయ్యే కర్ణాటకను ప్రజలు కోరుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.