OTT Release: గెట్ రెడీ.. ఓటీటీలో ఈ వారం సినిమాలివే!

ధియేటర్లలోనే కాదు ఓటీటీల్లో కూడా పెద్ద సినిమాల జాతర నడుస్తుంది. బిగ్ స్క్రీన్ లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలతో పాటు వెబ్ సిరీస్, హాలీవుడ్ సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి.

OTT Release: గెట్ రెడీ.. ఓటీటీలో ఈ వారం సినిమాలివే!

Ott Release

OTT Release: ధియేటర్లలోనే కాదు ఓటీటీల్లో కూడా పెద్ద సినిమాల జాతర నడుస్తుంది. బిగ్ స్క్రీన్ లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలతో పాటు వెబ్ సిరీస్, హాలీవుడ్ సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. ఒకవైపు థియేటర్లలో భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నా OTTలో మాత్రం గ్రాండ్ కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. OTTలలో విడుదల అవుతున్న సినిమాపై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుండడంతో అందుకు తగ్గట్టుగానే OTT సంస్థలు ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో దూసుకొస్తున్నాయి.

Ghani: వరుణ్ తేజ్ గని OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

మరి ఈ వారం ఏ సినిమా ఎప్పుడు ఏ ఓటీటీలోకి రాబోతోందో డీటెయిల్డ్ గా చూద్దాం. శర్వానంద్, రష్మిక మందాన జంటగా నటించిన ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ ఆడవాళ్లు మీకు జోహార్లు ఏప్రిల్‌ 14వ తేదీ నుంచి సోనీలివ్‌ లో స్ట్రీమింగ్‌ కానుంది. అభిషేక్‌ దుహన్‌, నైనా గంగూలీ, అభిలాష్‌ చౌదరి, అగస్త్య మంజు నటించిన.. రామ్‌గోపాల్‌ వర్మ మొట్టమొదటి ఓటీటీ సిరీస్‌ ‘దహనం’ ఏప్రిల్‌ 14వ తేదీ నుంచి ఎంఎక్స్‌ ప్లేయర్‌ లో ప్రసారం కానుంది. ఏడు ఎపిసోడ్లుగా ఈ సిరీస్‌ స్ట్రీమింగ్ కానుంది.

Theaters VS OTT: నువ్వా నేనా.. టైమ్ చూసి దెబ్బ కొడుతున్న ఓటీటీలు!

సీనియర్ నటి రాధిక శరత్‌ కుమార్‌, హీరో సాయి కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘గాలివాన’ ఏప్రిల్‌ 14వ తేదీ నుంచి జీ5లో స్ట్రీమింగ్‌ కానుంది. యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ నివేతా పేతురాజ్ ప్రధాన పాత్రలో, చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బ్లడీ మేరీ. వెబ్ ఒరిజినల్‌ గా ఏప్రిల్ 15 నుంచి అచ్చ తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.