Leopard Cub : చిరుతను దుప్పట్లో చుట్టేసిన మహిళ..! సో గ్రేట్ అంటున్న అధికారులు, జనాలు

చిరుతపులి పిల్లను.. ఓ మహిళ దుప్పట్లో చుట్టేసింది. ఎందుకు ఆమె అలా చేసిందో తెలిసిన జనాలు, అధికారులు.. ప్రశంసలు కురిపిస్తున్నారు.

Leopard Cub : చిరుతను దుప్పట్లో చుట్టేసిన మహిళ..! సో గ్రేట్ అంటున్న అధికారులు, జనాలు

Leopard Cub Rescued And Wrapped

Updated On : September 30, 2021 / 5:40 PM IST

Leopard Cub Rescued And Wrapped : చిరుతపులి పిల్లను ఓ మహిళ దుప్పట్లో చుట్టేసింది. ఎందుకు ఆమె అలా చేసిందో తెలిసిన జనాలు, అధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ.. ఆమె ఎందుకలా చేసింది? ఆ చిరుతపులి పిల్ల ఆమెకు ఎక్కడ దొరికిందీ.. అంటే.. దీనికి కారణం ముంబైలో దంచికొడుతున్న భారీ వర్షాలే కారణం.

ముంబైలో భారీగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైన సంగతి తెలిసిందే. ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. ఈ వర్షాలకు అడవుల్లో ఉండే జంతువులు కూడా చెల్లాచెదురైపోతున్నాయి. అలా చెదిరిపోయి జనాల్లోకి వచ్చేసి ఎటు వెళ్లాలో తోచక బెంబేలెత్తిపోతున్నాయి. భారీ వర్షాలకు పాపం జంతువులు దారి తప్పి అడవికి సమీపంలో ఉన్న ప్రాంతాల్లోకి వచ్చేస్తున్నాయి. రోడ్లపైకి వచ్చి ప్రమాదాలకు కూడా గురవుతున్నాయి.  తాజాగా.. అలాంటి సంఘటనే ముంబైలోని ఆర్‌మీల్స్‌ కాలనీలో జరిగింది.

Read more : Kid Poem ‘smelly dad’ : మా నాన్న ఫైజర్..ఎప్పుడు వాడడు రేజర్,మా నాన్న బొడ్డు కంపు : ఐదేళ్ల చిన్నారి కవిత వైరల్

ఆర్‌మీల్స్‌ కాలనీ అడవికి దగ్గరలో ఉంటుంది. ఇటీవల ముంబై, ఆ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు అడవిలో ఉండే ఒక చిరుత పిల్ల.. తన తల్లినుంచి తప్పిపోయి.. జనావాసాల సమీపంలోకి వచ్చింది. పాపం.. ఆ చిరుత పిల్ల తల్లి కోసం అటు ఇటూ తిరుగింది. ఆ ప్రాంతమంతా దానికి కొత్తగా ఉంది. తల్లి కనిపించట్లేదు. తోటి చిరుత పిల్లలూ కనిపించక పాపం అది గందరగోళానికి గురై అటూ ఇటూ తిరుగింది. అలా తిరుగుతున్న ఆ చిరుత పిల్లని ముంబాలికర్స్‌ అనే మహిళ గమనించింది. పాపం వర్షానికి తడిచి ముద్దైపోయి వణికిపోతున్న ఈ చిరుతకూనను అక్కడి నుంచి తన ఇంటికి తీసుకెళ్లింది.  ఓ దుప్పటిలో చుట్టింది వేడి కోసం. సపర్యలు చేసింది. దానికి పాలు తాగించింది.

Read more : Nusret Gokse Salt Bae Bill : సింగిల్‌ మీల్‌ రూ.1,80,000..అయినా ఆ రెస్టారెంటుకు క్యూ కడుతున్న కష్టమర్లు..ఎందుకంటే..

ఆ తర్వాత అటవీ అధికారులతో పాటు స్థానిక పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించింది. మహిళ ఇంటికి చేరుకున్న అధికారులు ఆ చిరుత పిల్లను తీసుకుని ఆమెను అభినందించారు. దాన్ని తీసుకెళ్లి తిరిగి అడవిలో వదిలి.. దాని తల్లి దగ్గరకు చేర్చే ప్రయత్నాలు చేస్తూన్నారు. ప్రస్తుతం ఈ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీన్ని చూసిన నెటిజన్లు చిరుతపిల్ల ప్రాణాలు కాపాడిన మహిళను ప్రశంసిస్తున్నారు. ఎలాగైనా అటవీ అధికారులు చిరుతపిల్లను దాని తల్లి దగ్గరకు చేర్చండి.. అంటూ కోరుతున్నారు నెటిజన్లు.