Mothers and asks : మాస్కును అమ్మతో  పోల్చిన పోలీసులు..బహుత్ అచ్చాహై..

‘‘మాస్కు..అమ్మ ఒక్కటే మనల్ని కాపాడుతుంటారు’’అంటూ ఓ చక్కటి ఫోటోను పోస్ట్ చేశారు ముంబై పోలీసులు. ఈ ఫోటో చూస్తే వావ్.. ఎంత చక్కటి ఆలోచన ముంబైపోలీసులది అనిపిస్తుంది కచ్చితంగా..మాస్క్‌, అ‍మ్మను రెండింటి మధ్య పోలికలు ఏమిటో తెలుసా అంటూ ఒక చిత్రాన్ని పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది.

Mothers and asks : మాస్కును అమ్మతో  పోల్చిన పోలీసులు..బహుత్ అచ్చాహై..

Mothers And Asks

Mothers and asks : కరోనా వచ్చిందయ్యో మాస్కులు తెచ్చిందయ్యో అన్నట్లుగా ఉన్నాయి ప్రపంచంలో ఎవరి ముఖాలు చూసినా. కానీ ముఖాన్ని మాస్కుతో కవర్ చేసుకుంటే మనల్ని ‘‘మాస్క్ అమ్మలా కాపాడుతుంది’’అని ఓ బెస్ట్ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ముంబైపోలీసులు.నిజంగా ఈ ఫోటోను చూస్తే ముంబై పోలీసులు తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాలనిపిస్తుంది.

కరోనా జనాలకు పరిచయం అయి దాదాపు రెండేళ్లు దాటుతున్నా ఇంకా ప్రజల్లో మాస్క్ పట్ల నిర్లక్ష్యం పోవటంలేదు. దీంతో పోలీసులు ప్రజలకు మాస్క్ పెట్టుకునే విషయంలో ముంబై పోలీసులు చక్కటి అవగాహన కల్పిస్తున్నారు. మా అనే అక్షరాన్ని హిందీలో రాసి స్క్ అనే అక్షరాలను ఇంగ్లీషులో రాసి ఓ ఫోటోను క్రియేట్ చేశారు ముంబైపోలీసులు. దాన్ని ట్విట్టలో పోస్ట్ చేస్తూ..‘‘మాస్కు..అమ్మ ఒక్కటే మనల్ని కాపాడుతుంటారు’’అని తెలిపారు. ఎంత చక్కటి ఆలోచన ముంబైపోలీసులది అనిపిస్తుంది కచ్చితంగా..ఈ ఫోటో చూస్తే..

మాస్క్‌, అ‍మ్మను రెండింటి మధ్య పోలికలు ఏమిటో తెలుసా అంటూ ఒక చిత్రాన్ని పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. అమ్మ మనకు జన్మనించి నవమాసాలు మోసి, తన పిల్లలకు ఎలాంటి ఆపద రాకుండా చూస్తుంది. అలాగే ప్రతి ఒకరు విధిగా మాస్క్‌ ధరిస్తే అది కూడా మనల్ని కరోనా వైరస్‌ నుంచి కాపాడుతుందనే సందేశం ఆ ఫొటో ద్వారా తెలిపారు. కాగా ఆ ఫొటోలో ‘మా’ అనే హిందీ పదానికి ఎస్‌కే అక్షరాలను జోడించి మాస్క్ అని అర్ధం వచ్చేలా చేశారు. ఈ పోస్ట్‌ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఫోటో చూసినవారంతా ముంబై పోలీసులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. హ్యాట్సాఫ్ పోలీసు అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

దేశవ్యాప్తంగా కరోనావైరస్‌ చాపకిందనీరులా విస్తరిస్తూనే ఉంది. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలు వారాంతపు కర్ఫ్యూలు, కఠినమైన నిబంధనలను విధిస్తున్నాయి. కాగా కోవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టడానికి, ప్రజల్లో చైతన్యం తేవడం కోసం ముంబై పోలీసులు సోషల్‌ మీడియాలో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగానే ముంబై పోలీసులు సోషల్‌ మీడియాలో మాస్క్‌కు ఉన్న ప్రాముఖ్యం తెలియజేస్తూ ఈ ఫొటో విడుదల చేశారు. భలే ఉందికదూ..వీరి క్రియేషన్..