Mahesh Babu : మీరెంత చేసినా సినిమా, కలెక్షన్స్ హిట్.. ‘సర్కారు వారి పాట’ నెగిటివ్ ట్రెండ్స్‌పై మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్..

కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఈ సినిమాపై సినిమా మొదటి షో పడకముందు నుంచే నెగిటివ్ టాక్ ని ప్రచారం చేశారు. కొంతమంది ఏకంగా డిజాస్టర్svp అంటూ ట్విట్టర్ లో ట్రెండ్..........

Mahesh Babu : మీరెంత చేసినా సినిమా, కలెక్షన్స్ హిట్.. ‘సర్కారు వారి పాట’ నెగిటివ్ ట్రెండ్స్‌పై మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్..

Svp

Sarkaru Vaari Paata :  మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా మే 12న రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతూ ఇప్పటికే 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిన సంగతి తెలిసిందే. అయితే కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఈ సినిమాపై సినిమా మొదటి షో పడకముందు నుంచే నెగిటివ్ టాక్ ని ప్రచారం చేశారు. కొంతమంది ఏకంగా డిజాస్టర్svp అంటూ ట్విట్టర్ లో ట్రెండ్ చేశారు. సినిమా చూడకుండానే యాంటీ ఫ్యాన్స్ ఇలా చాలా వ్యతిరేకంగా ప్రచారం చేశారు.

సినిమా మీద సోషల్ మీడియాలో ఎంత నెగిటివిటి ప్రచారం చేసినా థియేటర్ కి వచ్చి చూసిన వాళ్ళు సినిమా బాగుంది అని చెప్పడంతో సినిమాకి మరింత హైప్ వచ్చి కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఇంకా వీకెండ్ ఉండటంతో థియేటర్లన్నీ హౌస్ ఫుల్ గానే ఉన్నాయి. హైదరాబాద్ లో అయితే గత రెండు రోజులుగా పలు థియేటర్లలో టికెట్లు దొరకని పరిస్థితి కూడా ఉంది. అయితే ఇంత నెగిటివిటి వచ్చినా సినిమా హిట్ అవ్వడంతో ఈ నెగిటివిటీని ముందు నుంచి గమనిస్తున్న నిర్మాతలు యాంటీ ఫ్యాన్స్ కి షాక్ ఇస్తూ ఓ ట్వీట్ చేశారు.

Vikram : కమల్ హాసన్ సాంగ్ పై కేసు నమోదు..

మైత్రి మూవీ మేకర్స్ తన ట్విట్టర్ లో.. ”సర్కారు వారి పాట షోలు ఇంకా పడకముందే నెగెటివ్ ట్రెండ్స్‌లు, మీమ్స్, ట్రోల్స్ చేశారు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు బ్లాక్ బస్టర్ అనే స్థాయికి సినిమా వచ్చింది. సినిమా మూడో రోజు ఫస్ట్, సెకండ్ షోలు కూడా హౌస్ ఫుల్ అయ్యాయి. సూపర్ స్టార్ స్వాగ్ సీజన్‌ను ఎంజాయ్ చేయండి, సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్” అని ట్వీట్ వేసింది. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తుంటే యాంటీ ఫ్యాన్స్ ఏం చేయాలో తెలియక ఈ ట్వీట్ ని కూడా ట్రోల్ చేస్తున్నారు.