Naga Chaitanya : చైతుతో విజయ్ సినిమా..

అల్లరి నరేష్ ‘నాంది’ తో డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అయిన విజయ్ కనకమేడలతో చైతు సినిమా చెయ్యబోతున్నారట..

Naga Chaitanya : చైతుతో విజయ్ సినిమా..

Naga Chaitanya

Updated On : August 22, 2021 / 6:24 PM IST

Naga Chaitanya: యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య వరుసగా సినిమాలు లైనప్ చేస్తున్నారు. ‘లవ్ స్టోరీ’ రిలీజ్‌కి రెడీగా ఉంది. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ మూవీ చేస్తూనే.. ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.

Chai – Sam : క్యూట్ కపుల్ కల నెరవేరింది..

ఇంతలో తండ్రి ‘కింగ్’ నాగార్జునతో కలిసి ‘సోగ్గాడే చిన్నినాయనా’ ప్రీక్వెల్ ‘బంగార్రాజు’ స్టార్ట్ చేసేశారు. ఇప్పుడు మరో క్రేజీ సినిమా లైన్‌లో పెట్టినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అల్లరి నరేష్ ‘నాంది’ తో డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అయిన విజయ్ కనకమేడలతో చైతు సినిమా చెయ్యబోతున్నారట.

Naandhi

అల్లరి నరేష్ ఇమేజ్‌కి భిన్నంగా ‘నాంది’ లాంటి ఎమోషనల్ సబ్జెక్ట్‌ని డీల్ చేసి మంచి హిట్ కొట్టాడీ యంగ్ డైరెక్టర్. ఎప్పటినుంచో సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న నరేష్‌కి కమ్‌బ్యాక్ సినిమా అయ్యింది ‘నాంది’. చైతుకి విజయ్ చెప్పిన పాయింట్ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఇప్పుడున్న కమిట్‌మెంట్స్ కంప్లీట్ అవగానే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం.

Bangarraju : ‘బంగార్రాజు’ స్టార్ట్ అయ్యాడు.. ఆనందంలో అక్కినేని అభిమానులు..