Nagarjuna : 1080 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకున్న నాగార్జున

తాజాగా ఇవాళ ఉదయం అక్కినేని నాగార్జున 1080 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకున్నారు. ఇందులో భాగంగా అక్కడ చెట్లు నాటారు. ఈ 1080 ఎకరాల భూమిలో చెట్లని పెంచి పూర్తిగా పచ్చదనంతో అడవిని......

Nagarjuna : 1080 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకున్న నాగార్జున

New Project (1)

Green India Challenge :  ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో దేశ వ్యాప్తంగా మొక్కలు నాటడం, నాటించడం చేస్తున్నారు. ఎంతో మంది సెలబ్రిటీలతో మొక్కలు నాటించి, వాళ్ళని ఇంకొకరితో నాటించేలా చేశారు. సెలబ్రిటీలతో కొన్ని మొక్కలని, పార్కులని, అడవులని కూడా దత్తత తీసుకునేలా చేశారు జోగినపల్లి సంతోష్‌కుమార్‌.

గత బిగ్ బాస్ సీజన్ లో గెస్టుగా వచ్చిన ఆయన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి మాట్లాడారు. అయితే ఈ సందర్భంగా నాగార్జున కూడా ఒక అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటానని ఎంపీ సంతోష్‌ కుమార్‌ ఎక్కడ చూపిస్తే అక్కడ వెయ్యి ఎకరాలు దత్తత తీసుకుని మొక్కలు పెంచడానికి నాగ్ సిద్ధమని తెలిపారు.అప్పుడు బిగ్ బాస్ లో ఇచ్చిన మాటని ఇప్పుడు నెరవేర్చుకుంటున్నారు నాగార్జున.

Pradeep Kottayam : సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత..

తాజాగా ఇవాళ ఉదయం అక్కినేని నాగార్జున 1080 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకున్నారు. ఇందులో భాగంగా అక్కడ చెట్లు నాటారు. ఈ 1080 ఎకరాల భూమిలో చెట్లని పెంచి పూర్తిగా పచ్చదనంతో అడవిని సృష్టించనున్నారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కి ఇచ్చిన వాగ్దానం మేరకు వీటిని దత్తత తీసుకున్నారు నాగార్జున. ఈ 1080 ఎకరాల్లో ఉన్న చెట్లు పెరగడానికి కావాల్సిన వసతులన్నీ నాగార్జున సమకూర్చనున్నారు.

Meera Jasmine : బోయపాటి-రామ్ సినిమాలో మీరా జాస్మిన్?

ఈ కార్యక్రమంలో ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్, నాగార్జునతో పాటు నాగచైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్, నాగ సుశీల.. అక్కినేని కుటుంబం అంతా పాల్గొన్నారు. ఈ ప్రాంతానికి అక్కినేని నాగేశ్వరరావు అర్బన్ ఫారెస్ట్ పార్క్ అని నామకరణం చేశారు. నాగ్ తీసుకున్న ఈ నిర్ణయానికి అభిమానులు ప్రశంశిస్తున్నారు.