Nagarjuna : తన స్కూల్ వందేళ్ల పండుగలో సందడి చేసిన హీరో నాగార్జున..

ప్రతి ఒక్కరికి చదువుకున్న స్కూల్ కి గెస్ట్ గా వెళ్ళాలి అనే ఒక డ్రీం ఉంటుంది. అయితే అది చాలా తక్కుమంది మాత్రమే నెరవేర్చుకుంటారు. అలా మాస్టర్ చేత దెబ్బలు తిన్న స్కూల్ కి అతిధిగా వెళ్ళినప్పుడు కలిగే ఫీలింగ్ మాటల్లో చెప్పలేనిది. తాజాగా అటువంటి అనుభవమే టాలీవుడ్ కింగ్ నాగార్జున అనుభవించాడు.

Nagarjuna : తన స్కూల్ వందేళ్ల పండుగలో సందడి చేసిన హీరో నాగార్జున..

nagarjuna

Nagarjuna : ప్రతి ఒక్కరికి చదువుకున్న స్కూల్ కి గెస్ట్ గా వెళ్ళాలి అనే ఒక డ్రీం ఉంటుంది. అయితే అది చాలా తక్కుమంది మాత్రమే నెరవేర్చుకుంటారు. అలా మాస్టర్ చేత దెబ్బలు తిన్న స్కూల్ కి అతిధిగా వెళ్ళినప్పుడు కలిగే ఫీలింగ్ మాటల్లో చెప్పలేనిది. తాజాగా అటువంటి అనుభవమే టాలీవుడ్ కింగ్ నాగార్జున అనుభవించాడు. తన చదువుకున్న స్కూల్ వంద సంవత్సరాల వేడుకకు ముఖ్య అతిధిగా వెళ్ళాడు. బేగం పేట్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 1923 లో ప్రారంభమైంది. ఈ ఏడాదితో 100 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో ఈ ఏడాది మొత్తం శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

Nagarjuna: నాగార్జున్ నెక్ట్స్ మూవీ కూడా రీమేకేనా..?

కాగా ఈ వేడుకకు నాగార్జునతో పాటు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన నగర్ కమీషనర్ సీవీ ఆనంద్, అడోబ్ సీఈఓ శాంతను నరేన్ హాజరవ్వగా, తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ గెస్ట్ గా పాల్గొన్నారు. 1976 లో నాగార్జున ఈ స్కూల్ లో చదువుని అభ్యసించాడు. ఇక ఈ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వందేళ్లు పూర్తి కావడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక ఈ స్కూల్ లో చదివిన నేను వందేళ్ల పండుగకు గెస్ట్ గా రావడం ఇంకా హ్యాపీ గా ఉంది. ఈ స్కూల్ కు మళ్లీ ఇప్పుడు రావడం పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. మూడేళ్ల వయస్సు నుంచి ఈ స్కూల్ లో చదివా. స్కూల్ లో విద్యాబుద్దులతో పాటు కాన్ఫిడెంట్ లెవల్ పెంపొందించారు’ అంటూ వ్యాఖ్యానించాడు. అనంతరం నాగార్జున, జయేష్ రంజన్ వంద ఏళ్లు పూర్తి అయిన సందర్బంగా.. స్కూల్ లోగోని ఆవిష్కరించారు.

ఇక నాగార్జున సినిమాలు విషయానికి వస్తే.. చివరిగా ‘ది ఘోస్ట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో అలరించలేక పోయింది. గత ఏడాది అక్టోబర్ లో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. అప్పటి నుంచి మరో మూవీని ప్రకటించలేదు నాగార్జున.