Dasara Trailer Released : పురాణాలను మించిన బ్రతుకులా మనవి.. మాస్ మూలవిరాట్‌గా దర్శనం ఇవ్వబోతున్న నాని..

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న కొత్త చిత్రం 'దసరా'. ఈ సినిమాతో నాని కంప్లీట్ మాస్ మూలవిరాట్‌ రూపంలో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్ అండ్ సాంగ్స్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ లో మూవీ పై మంచి బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.

Dasara Trailer Released : పురాణాలను మించిన బ్రతుకులా మనవి.. మాస్ మూలవిరాట్‌గా దర్శనం ఇవ్వబోతున్న నాని..

Dasara Trailer Released : నేచురల్ స్టార్ నాని నటిస్తున్న కొత్త చిత్రం ‘దసరా’. ఈ సినిమాతో నాని కంప్లీట్ మాస్ మూలవిరాట్‌ రూపంలో కనిపించబోతున్నాడు. 90’s కాలంలో సింగరేణి బొగ్గు గనులు నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర వర్క్ చేసిన శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్ అండ్ సాంగ్స్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ లో మూవీ పై మంచి బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.

Oscars95 : గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఆస్కార్ చూసిన వారి సంఖ్య 12% పెరిగింది.. కారణం అదేనా?

టీజర్ లో ఎక్కడా కీర్తి సురేష్ ని చూపించని మేకర్స్.. ట్రైలర్ ని కీర్తి సురేష్ తోనే మొదలు పెట్టారు. ఇక టీజర్ లో చూపించినట్లే ట్రైలర్ లో కూడా నానిని ఫుల్ యాక్షన్ మోడ్ లో చూపించారు. నానికి బాగా తాగుడు అలవాటు ఉండడంతో.. మందు తాగి మత్తులో అందర్నీ కొట్టడం, మత్తు దిగిన తరువాత అంతా మర్చిపోవడం చేస్తుంటాడు. ఈ క్రమంలోనే తగిన మైకంలో నాని ఒక పెద్ద తప్పు చేయడం, దాని వల్ల కథ మలుపు తిరగడం సినిమా కథ అని తెలుస్తుంది. అలాగే ట్రైలర్ చూస్తుంటే.. ఈ మూవీ పొలిటికల్ డ్రామాగా ఉండబోతుందని అర్ధమవుతుంది.

Dasara : దసరాలో నాని కో-స్టార్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..

ఇక ట్రైలర్ మొత్తాన్ని పవర్ ప్యాకెడ్ యాక్షన్ సీన్స్ తో నింపేశాడు డైరెక్టర్. ట్రైలర్ లో సముద్రఖని చెప్పిన డైలాగ్ ముఖ్యంగా అందర్నీ ఆకట్టుకుంటుంది. ‘పురాణాలను మించిన బ్రతుకులా మనవి. పది తలలు ఉన్నవాడే ఒక్క తల ఉన్నవాడి చేతిలో కుక్క సావు సచ్చాడు’ అనే డైలాగ్ పవర్ ఫుల్ గా ఉంది. అలాగే ఈ సినిమాలో ఒక మంచి లవ్ స్టోరీ కూడా ఉందని ట్రైలర్ లాస్ట్ ఫ్రేమ్ చూస్తే అర్ధమవుతుంది. హీరో, హీరోయిన్ లు మధ్య చిన్నపాటి నుంచే ప్రేమ ఉన్నట్లు తెలుస్తుంది. కాగా సాంకేతిక విలువలు చాలా బాగున్నాయి. ప్రతి ఫ్రేమ్ ఆడియన్స్ ఒక కొత్తగా అనుభూతుని ఇచేలా ఉంది.

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పథకం పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ప్రాజెక్ట్ K సినిమాకి సంగీతం అందించబోతున్న సంతోష్ నారాయణన్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నాడు. కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి నానికి స్నేహితుడిగా ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. మలయాళ నటుడు షైన్ టామ్ చాకో, సముద్రఖని, సాయి కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ మూవీతో నాని పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాడు.