Naresh-Pavithra : ఇదంతా సినిమా కోసమా.. మళ్ళీ పెళ్లి అంటూ అందర్నీ ఆశ్చర్యపరిచిన నరేష్, పవిత్ర..
ఇటీవల వచ్చిన పెళ్లి వీడియో మాత్రం షూట్ వీడియో అని కొంతమంది అనగా ఇప్పుడు అదే నిజమైంది. తాజాగా నేడు నరేష్ - పవిత్ర మెయిన్ లీడ్స్ లో నరేష్ సొంత నిర్మాణంలో MS రాజు డైరెక్షన్ లో మళ్ళీ పెళ్లి అనే టైటిల్ తో సినిమాని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. దీనికి సంబంధించి ఓ వీడియోని.................

Naresh and Pavithra announce their movie title malli pelli poster and video goes viral
Naresh-Pavithra : టాలీవుడ్ లో ఇటీవల కొన్నాళ్ళు బాగా వైరల్ అయిన జంట సీనియర్ నటుడు నరేష్ – నటి పవిత్ర లోకేష్. ఓ సినిమాలో కలిసి నటించిన వీరు బయట కూడా చెట్టాపట్టాలేసుకొని తిరగడంతో బాగా వైరల్ అయ్యారు. ఇక నరేష్ తన మూడో భార్యతో గొడవలు పడటం, ఇవి రోడ్డుకెక్కడం, పవిత్ర-నరేష్ కలిసి ఓ హోటల్ లో ఉన్నప్పుడు మూడో భార్య అక్కడికి రావడం.. ఈ రచ్చ అంతా సోషల్ మీడియాలో, వార్తల్లో బాగా ట్రెండ్ అయింది. దీంతో నరేష్-పవిత్ర లోకేష్ పై పలు వార్తలు, గాసిప్స్ వచ్చినా మొదట స్పందించకపోయినా 2023 న్యూ ఇయర్ సందర్భంగా అందరికి షాక్ ఇస్తూ వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి, ఇద్దరూ కలిసి కేక్ కట్ చేసి, లిప్ కిస్ ఇచ్చుకున్న ఓ వీడియోని షేర్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
ఈ వీడియో బాగా వైరల్ అవ్వడంతో ఆ తర్వాత నరేష్ మూడో భార్య రమ్య ఈ వీడియోపై స్పందిస్తూ వీళ్ళిద్దర్నీ పెళ్లి చేసుకోనివ్వను, నేను విడాకులు ఇవ్వను అంటూ రచ్చ చేయడం.. నరేష్ పై దాడి, నరేష్ కోర్టుకి వెళ్లడం.. ఇలా అనేక సంఘటనలతో నిజంగానే నరేష్ పవిత్రని పెళ్లి చేసుకోబోతున్నాడు అని అనుకున్నారు అంతా. ఇటీవల సడెన్ గా నరేష్ పవిత్రలు సాంప్రదాయబద్దంగా గుడిలో పెళ్లి చేసుకున్నట్టు ఓ వీడియో షేర్ చేశారు. అయితే నిజంగానే పెళ్లి జరిగింది అనుకున్నా, కొంతమంది మాత్రం ఇది సినిమా షూట్ అని అన్నారు. ఈ పెళ్లి వీడియో, ఈ లిప్ కిస్ వీడియో నిజంగానే అంటూ నరేష్ ట్వీట్స్ చేయడం విశేషం.
ఇటీవల వచ్చిన పెళ్లి వీడియో మాత్రం షూట్ వీడియో అని కొంతమంది అనగా ఇప్పుడు అదే నిజమైంది. తాజాగా నేడు నరేష్ – పవిత్ర మెయిన్ లీడ్స్ లో నరేష్ సొంత నిర్మాణంలో MS రాజు డైరెక్షన్ లో మళ్ళీ పెళ్లి అనే టైటిల్ తో సినిమాని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. దీనికి సంబంధించి ఓ వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియోలో పవిత్ర ముగ్గులేస్తుంటే నరేష్ వచ్చి చూస్తున్నట్టు ఉంది. ఇది సినిమా అని తెలియడంతో ఇప్పటిదాకా చేసింది సినిమా ప్రమోషన్స్ కోసమా అని కొంతమంది నరేష్, పవిత్రాలను మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు. ఇంకొంతమంది సినిమా ఓకే నిజంగా కూడా పెళ్లి చేసుకుంటున్నారా లేదా అని కామెంట్స్ చేస్తున్నారు.
Manchu Vishnu Vs Manoj : అన్నదమ్ముల గొడవ పై స్పందించిన మోహన్ బాబు.. నాకేం తెలియదంటున్న మంచు లక్ష్మి!
ఒక సినిమా ప్రమోషన్స్ కోసం మరీ ఈ రేంజ్ కి నరేష్ వెళ్లాడా, లేదా సినిమాతో పాటు వీళ్ళ పెళ్లి కూడా నిజమేనా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు జనాలు. ఇక మళ్ళీ పెళ్లి అనే టైటిల్ తో ఈ సినిమా సమ్మర్ లో రాబోతుందని ప్రకటించారు. అలాగే పోస్టర్ పై నవరస రాయ అనే బిరుదుతో నరేష్ పేరు వేసుకోవడం గమనార్హం. ఈ పోస్టర్ తో మరోసారి ట్రెండింగ్ అవుతున్నారు నరేష్ – పవిత్ర. ఇప్పుడే ఈ రేంజ్ లో సినిమా ప్రమోషన్స్ చేస్తే ఇక సినిమా రిలీజ్ కి ఇంకే రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తారేమో చూడాలి. ఇక ఈ సినిమాని కన్నడలో కూడా రిలీజ్ చేయబోతుండటం విశేషం.
I am honoured to be a writer and director of #MalliPelli, Produced by legendary banner Vijay Krishna Movies which is celebrating its 50 Golden Years in cinema! ?✨
Check out the Sneak Peek ❤️ pic.twitter.com/DuMoptMBpP
— MS Raju (@MSRajuOfficial) March 24, 2023
#MalliPelli #MattheMaduve ❤️ pic.twitter.com/eqxa2TVELb
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 24, 2023