Nani Birthday Celebrations : నాని బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఎవరితో సెలబ్రేట్ చేసుకున్నాడో తెలుసా??
శుక్రవారం నాని పుట్టినరోజు కావడంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు నానికి బర్త్ డే శుభాకాంక్షలు చెప్పారు. ఇక నాని తన పుట్టిన రోజు వేడుకలను శుక్రవారం రాత్రి గ్రాండ్ గా తన స్నేహితులు, తోటి ఆర్టిస్టులతో జరుపుకున్నాడు.

Natural star Nani Birthday Celebrations with artists and friends
Nani Birthday Celebrations : న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి, సైడ్ హీరోగా చేసి ఆ తర్వాత హీరోగా వరుస సినిమాలతో హిట్స్ కొట్టి న్యాచురల్ స్టార్ గా ఎదిగాడు నాని. ఇటీవల వరుసగా డిఫరెంట్ కథలతో వస్తూ ప్రేక్షకులని మెప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. త్వరలో దసరా అనే పూర్తి మాస్ సినిమాతో రాబోతున్నాడు. తాజాగా నాని ఫిబ్రవరి 24న తన పుట్టిన రోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు.
శుక్రవారం నాని పుట్టినరోజు కావడంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు నానికి బర్త్ డే శుభాకాంక్షలు చెప్పారు. ఇక నాని తన పుట్టిన రోజు వేడుకలను శుక్రవారం రాత్రి గ్రాండ్ గా తన స్నేహితులు, తోటి ఆర్టిస్టులతో జరుపుకున్నాడు. నాని పుట్టిన రోజు వేడుకలకు అల్లరి నరేష్, నిర్మాత స్వప్నదత్, హీరోయిన్ నజ్రియా, ఫహద్ ఫాజిల్.. మరికొంతమంది నటులు, నాని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నాని పుట్టిన రోజు వేడుకలకు ఫహద్ ఫాజిల్, అల్లరి నరేష్, నజ్రియా రావడంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
నాని బర్త్ డే సెలబ్రేషన్స్ కి వచ్చిన వాళ్ళల్లో చాలా మంది బ్లాక్ డ్రెస్ లో కోడ్ తో వచ్చి సెలబ్రేట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నాని పుట్టిన రోజు వేడుకలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నాని దసరా సినిమా మార్చ్ 30న రిలీజ్ అవనుంది. ప్రస్తుతం నాని 30వ సినిమా షూట్ మొదలైంది.
Few more pics from @NameisNani ‘s birthday bash last night ?#HappyBirthdayNani #Nani #Dasara #Nani30 pic.twitter.com/qKicDgyqf9
— Nani Fans Association (@nfa_hyd) February 24, 2023