NBK107: బాలయ్య సినిమాకు అంత సమయమా..?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా....

NBK107: బాలయ్య సినిమాకు అంత సమయమా..?

NBK107: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు గోపీచంద్ తెరకెక్కిస్తుండటంతో, అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇప్పటికే రిలీజ్ అయ్యి అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

NBK107: బాలయ్యకు రాయల్‌గా బర్త్‌డే విషెస్ చెప్పిన NBK107 టీమ్!

అయితే ఈ సినిమా రిలీజ్ విషయానికి సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. బాలయ్య 107వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాను డిసెంబర్ నెలలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత దసరా బరిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావించినా, బాక్సాఫీస్ వద్ద పోటీ వాతావరణం తప్పించేందుకే ఈ సినిమా రిలీజ్‌ను డిసెంబర్‌లో ఫిక్స్ చేశారట చిత్ర యూనిట్.

NBK107: గెట్ రెడీ.. బాలయ్య వచ్చేస్తున్నాడు!

ఈ చిత్రాన్ని డిసెంబర్ 23న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ మక్కువగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గతేడాది డిసెంబర్‌లో బాలయ్య అఖండ రిలీజ్ అయ్యి అదిరిపోయే సక్సెస్‌ను అందుకుంది. ఇప్పుడు అదే సెంటిమెంట్‌తో ఈ సినిమాను కూడా డిసెంబర్ నెలలో రిలీజ్ చేయాలని బాలయ్య అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారట. మరి నిజంగానే బాలయ్య 107వ సినిమా కోసం అంత సమయం వేచి చూడాలా.. లేక ఇవన్నీ కేవలం పుకార్లేనా.. అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.