Khalistan References: 12వ తరగతి పాఠ్యపుస్తకాల్లో నుంచి ఖలిస్తానీ అంశాన్ని తొలగించిన ఎన్‭సీఈఆర్‭టీ

పుస్తకంలోని ఒక పేజీలో 1970లో అకాలీకి చెందిన ఒక వర్గం ఈ ప్రాంతానికి రాజకీయ స్వయంప్రతిపత్తిని కోరడం ప్రారంభించిందని, ప్రాంతీయ స్వయంప్రతిపత్తిపై ఉద్ఘాటన వ్యక్తం చేయబడిందని పేర్కొన్నారు. తర్వాతి పేరాలో పంజాబ్‌లో హింసాకాండ, సాయుధ తిరుగుబాటు గురించి ప్రస్తావన ఉంది. ఇదే పేజీలో ఆపరేషన్ బ్లూస్టార్‌ గురించి కూడా ప్రస్తావించారు.

Khalistan References: 12వ తరగతి పాఠ్యపుస్తకాల్లో నుంచి ఖలిస్తానీ అంశాన్ని తొలగించిన ఎన్‭సీఈఆర్‭టీ

NCERT: శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ విద్యా మంత్రిత్వ శాఖకు లేఖ రాసిన తర్వాత 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పాఠ్యపుస్తకంలోని ‘‘స్వాతంత్ర్యం అనంతరం భారతదేశంలో రాజకీయాలు, వాటి మనుగడ’’ నుంచి ఖలిస్తాన్ అంశాలనికి చెందిన పాఠాలను ఎన్‭సీఈఆర్‭టీ తొలగించింది. పాఠ్యపుస్తకంలోని 159వ పేజీలో ఆనంద్‌పూర్ సాహిబ్ రిజల్యూషన్-1973 సందర్భంలోని అంశాలు ఉన్నాయి. “ఈ తీర్మానం సమాఖ్యవాదాన్ని బలోపేతం చేయడం కోసం చేసిన అభ్యర్థన, కానీ అది సిక్కు దేశం కోసం చేసిన అభ్యర్థనగా కూడా వ్యాఖ్యానించబడుతుంది, ప్రత్యేక సిక్కు దేశం కోసం అభ్యర్ధనగా వ్యాఖ్యానించబడింది” అనే భాగాన్ని తొలగించారు.

Supreme Court: సోషల్ మీడియా యూజర్లకు గట్టి హెచ్చరిక చేసిన సుప్రీంకోర్టు.. జడ్జిలను ఏమైనా అంటే జైలుకేనట అంతేనట

“భారతదేశం నుంచి వారసత్వం, ఖలిస్తాన్ సృష్టిని సమర్థించడంలో మరిన్ని తీవ్ర అంశాలు మొదలయ్యాయి” అనే వ్యాఖ్యను సైతం పుస్తకం నుంచి తొలగించారు. పుస్తకంలోని ఒక పేజీలో 1970లో అకాలీకి చెందిన ఒక వర్గం ఈ ప్రాంతానికి రాజకీయ స్వయంప్రతిపత్తిని కోరడం ప్రారంభించిందని, ప్రాంతీయ స్వయంప్రతిపత్తిపై ఉద్ఘాటన వ్యక్తం చేయబడిందని పేర్కొన్నారు. తర్వాతి పేరాలో పంజాబ్‌లో హింసాకాండ, సాయుధ తిరుగుబాటు గురించి ప్రస్తావన ఉంది. ఇదే పేజీలో ఆపరేషన్ బ్లూస్టార్‌ గురించి కూడా ప్రస్తావించారు.

Multi-level Marketing: మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థల పట్ల ఆర్టీసీ ఎండీ సజ్జనర్ హెచ్చరిక

వీటన్నిటినీ తొలగించారు. అయితే మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు సంబంధించిన పాఠాన్ని మాత్రం తొలగించలేదు. ఈ నిర్ణయంపై ఎన్‭సీఈఆర్‭టీ అధికారులు స్పందిస్తూ ఆన్‌లైన్ వెర్షన్‌లో వెంటనే మార్పులు చేపడతామని తెలిపారు. పాఠ్యపుస్తకాల ముద్రణలో సైతం ఈ విభాగాన్ని తొలగిస్తామని పేర్కొన్నారు.