Jagdeep Dhankar : నేడు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్‌కర్‌ నామినేషన్ దాఖలు

రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో ధన్‌కర్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. మరోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో నిలిచిన జగదీప్‌ ధన్‌ఖడ్‌కు మద్దతు కూడగట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.

Jagdeep Dhankar : నేడు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్‌కర్‌ నామినేషన్ దాఖలు

Jagadeep

Jagdeep Dhankar : ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్‌కర్‌ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో ధన్‌కర్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. మరోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో నిలిచిన జగదీప్‌ ధన్‌ఖడ్‌కు మద్దతు కూడగట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. రైతు బిడ్డ అయిన ధన్‌కడ్‌కు అందరూ మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విపక్షాలను కోరారు.

రైతు బిడ్డ అయిన ధన్‌ఖడ్‌ వ్యవసాయ నేపథ్యం నుంచి కష్టపడి ఎదిగారన్నారు. వేర్వేరు హోదాల్లో పనిచేసి గత మూడు దశాబ్దాలుగా దేశానికి సేవలందిస్తున్నారని.. గొప్ప పరిపాలకుడిగా, సమర్థవంతమైన రాజకీయ నేతగా విజయవంతమయ్యారన్నారు. ఆయనకు అన్ని పార్టీలూ మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే.. ధన్‌ఖడ్‌ ఎన్నిక లాంఛనం కానుంది. భారత ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపిక అయిన పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్ ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చారు.

Jagdeep Dhankhar : జగదీప్‌ ధన్‌కర్‌ ఎవరంటే..? ‘రైతు బిడ్డగా’ మారుమూల గ్రామం నుంచి..

రాజస్థాన్‌‌కు చెందిన సీనియర్ న్యాయవాదిగా పేరొందిన జగదీప్.. 1951 మే 18న రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లా కితానా అనే ఓ మారుమూల పల్లెలో జన్మించారు. చిన్ననాటి నుంచి స్వశక్తితో ఎదిగిన వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు సాధించారు. న్యాయనిపుణిడిగా తన కెరీర్ మొదలుపెట్టి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు.

కాలినడకనే ప్రతిరోజూ 5 కిలోమీటర్ల వరకు వెళ్లి చదువుకునే వాడనని ఆయన చాలా ఇంటర్వ్యూలో చెబుతుండేవారు. అలాంటి సాధారణ రైతు బిడ్డగా మొదలైన ఆయన ప్రస్థానం.. ఒక సీనియర్ రాజకీయవేత్తగా బెంగాల్ గవర్నర్ స్థాయి వరకు ఎదిగారు. ఇప్పుడు జగదీప్ రాజకీయ అనుభవం, ఆయన చేసిన కృషిని గుర్తించిన బీజేపీ ఇప్పుడు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది.

vice president polls: విప‌క్ష పార్టీల ఉప రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా మార్గ‌రెట్ అల్వా

1989 లోక్‌సభ ఎన్నికల్లో జుంజును నుంచి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన తర్వాత ఆయన ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. అనంతరం 1990లో పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. 1993లో అజ్మీర్ జిల్లాలోని కిషన్‌గఢ్ నియోజకవర్గం నుంచి రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. జూలై 2019లో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఇంటర్నేషనల్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌లోనూ మెంబర్‌గా పని చేశారు. కొన్నాళ్లపాటు సుప్రీంకోర్టులోనూ పని చేసిన ఆయన 2003లో బీజేపీలో చేరారు.

2019లో పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా నియమించింది కేంద్ర ప్రభుత్వం. జగదీప్ భార్య సుదేశ్‌ ధన్‌కర్‌. కామ్నా కూతురు ఉన్నారు. అల్లుడు కార్తీకేయ వాజ్‌పాయి సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్నారు. మైనార్టీ కోటాలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తారని భావించినా.. ఊహించని రీతిలో ధన్‌కర్‌ పేరును బీజేపీ తెరపైకి తేవడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.