Mulugu Forest: ములుగు అడవిలో చిక్కుకున్నపర్యాటకులు సేఫ్.. సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
వీరభద్రవరం గ్రామానికి ఎనిమిది కిలో మీటర్ల సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న జలపాతం సందర్శనకు అటవీశాఖ నిషేధించింది. అయినప్పటికీ కరీంనగర్, వరంగల్ ప్రాంతాల నుంచి 84 మంది పర్యాటకులు బుధవారం సాయంత్రం జలపాతం వద్దకు వెళ్లారు.

NDRF teams
Mulugu Forest: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ముత్యాలధార జలపాతం సందర్శనకు వెళ్లి అడవిలో చిక్కుకున్న పర్యాటకులు సురక్షితంగా బయటపడ్డారు. ఎన్టీఆర్ఎఫ్ బృందాలు బుధవారం అర్థరాత్రి తరువాత అడవిలో చిక్కుకున్న 82 మంది పర్యాటకులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. బుధవారం వీరంతా ముత్యాలధార జలపాతం చూసేందుకు వెళ్లారు. భారీ వర్షం కారణంగా తిరుగు ప్రయాణంలో వాగుల ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పర్యాటకులు అడవిలోనే చిక్కుకుపోయారు. వీరంతా అడవిలో చిక్కుకుపోయిన విషయం బుధవారం రాత్రి వెలుగలోకి వచ్చింది. అధికారులకు సమాచారం అందిన వెంటనే మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశాల మేరకు పోలీసు ఉన్నతాధికారులు, ఎన్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్ బృందాలను సంఘటన స్థలానికి పంపించారు.
Hyderabad : బాబోయ్.. హైదరాబాద్ మళ్లీ కుంభవృష్టి.. 3గంటలు కుమ్ముడే, ఆందోళనలో నగరవాసులు
గత వారం రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తుండగా వీరభద్రవరం గ్రామానికి ఎనిమిది కిలో మీటర్ల సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న జలపాతం సందర్శనకు అటవీశాఖ నిషేధించింది. అయినప్పటికీ కరీంనగర్, వరంగల్ ప్రాంతాల నుంచి 84 మంది పర్యాటకులు బుధవారం సాయంత్రం జలపాతం వద్దకు వెళ్లారు. వీరుంతా తిరుగు ప్రయాణంలో మామిడివాగు ఉప్పొంగి ప్రవహించడంతో అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చేందుకు వీలు పడలేదు. దీంతో ఆందోళనలో పర్యాటకులు తాము అడవిలో చిక్కుకుపోయినట్లు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కు చెందిన తిరుమల్ డయల్ 100కు సమాచారం ఇచ్చాడు. అయితే, స్థానిక పోలీసులు, అధికారులు పర్యాటకులను రక్షించేందుకు ప్రయత్నం చేయగా భారీ వర్షం కారణంగా ఆ ప్రాంతానికి చేరుకోవటం కష్టతరంగా మారింది. దీంతో ములుగు కలెక్టర్, ఎస్పీలు అడవిలో చిక్కుకుపోయిన పర్యాటకులతో ఫోన్‌లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఎత్తైన ప్రదేశంలో ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో వాగు దాటేందుకు ప్రయత్నం చేయవద్దని సూచించారు.
Pawan Kalyan : ఏపీలో 30వేల మంది అమ్మాయిలు మిస్సింగ్.. మరోసారి పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్
అటవీ ప్రాంతంలో చిక్కుకుపోయిన పర్యాటకులను రక్షించేందుకు ఏటూరునాగారం నుంచి ఎన్డీఆర్ఎఫ్, జిల్లా డిజాస్టర్ రెస్సాన్స్ ఫోర్స్ (డీడీఆర్ఎఫ్) బృందాలు నాలుగు బస్సుల్లో ఆహారం, తాగునీటిని తీసుకొని బుధవారం అర్థరాత్రి పర్యాటకులు చిక్కుకుపోయిన ప్రాంతానికి బయలుదేరారు. రాత్రి 11గంటలకు వీరభద్రవరం చేరుకొని, అక్కడి నుంచి ఎనిమిది కిలో మీటర్లు కాలినడకన జలపాం వద్దకు బయలుదేరి వెళ్లారు. అర్థరాత్రి దాటిన తరువాత ఎన్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్ బృందాలు అడవిలో చిక్కుకున్న పర్యాటకుల వద్దకు చేరుకొని వారిని సురక్షితంగా అటవీ ప్రాంతం నుంచి బయటకు తీసుకొచ్చారు.