Hyderabad : బాబోయ్.. హైదరాబాద్ మళ్లీ కుంభవృష్టి.. 3 గంటలు కుమ్ముడే, ఆందోళనలో నగరవాసులు
భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్ అయ్యింది. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. Hyderabad Rain

Hyderabad Rain
Hyderabad Rain : హైదరాబాద్ ను వరుణుడు వెంటాడుతున్నాడు. నగరంలో వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరవాసులు బేంబేలెత్తిపోతున్నారు. బాబోయ్ ఇదే వాన? అని తల పట్టుకుంటున్నారు. ఇప్పటికే వానలతో పరేషాన్ అవుతుంటే.. ఇది చాలదన్నట్లు మళ్లీ హైదరాబాద్ లో వాన మొదలైంది. మరో 3 గంటల పాటు భారీ వర్షం కురవనుందని వాతావరణ కేంద్రం తెలిపింది.
చార్మినార్, ఖైరతాబాద్, కూకట్ పల్లి జోన్ లలో కుండపోత వాన పడుతోంది. ఎల్బీనగర్, హయత్ నగర్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట్, కోఠి ప్రాంతాల్లో వాన కురుస్తోంది. కూకట్ పల్లి, హైదర్ నగర్, మియాపూర్, శేరిలింగంపల్లిలో భారీ వాన పడుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్ అయ్యింది. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు.
ఇప్పటికే 3 రోజుల నుంచి వాన పడుతోంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు వరదలో చిక్కుకున్నాయి. ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ.. తాజాగా అధికారులను అప్రమత్తం చేసింది. సహాయక చర్యలు అందించేందుకు డీఆర్ఎఫ్ సిబ్బంది రెడీగా ఉన్నారు. ఏదైనా ఇబ్బంది ఉంటే తమకు ఫోన్ చేయాలని సూచించారు.
మరో మూడు గంటలు భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితేనే తప్ప బయటకు రావొద్దని అధికారులు చెబుతున్నారు.