Cyberabad Traffic Police : ‘హైడ్రో ప్లానింగ్’ అంటే ఏంటి? సైబరాబాద్ పోలీసులు షేర్ చేసిన వీడియోలో దాని గురించి ఏం చెప్పారు?

వర్షాకాలంలో ఏ మాత్రం అజాగ్రత్తగా వాహనాలు నడిపినా స్కిడ్ అయ్యి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. ఇలా స్కిడ్ అవడానికి కారణం ' హైడ్రో ప్లానింగ్' అట. దీని గురించి జాగ్రత్తలు చెబుతూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. అసలు 'హైడ్రో ప్లానింగ్' అంటే ఏంటి?

Cyberabad Traffic Police : ‘హైడ్రో ప్లానింగ్’ అంటే ఏంటి? సైబరాబాద్ పోలీసులు షేర్ చేసిన వీడియోలో దాని గురించి ఏం చెప్పారు?

Cyberabad Traffic Police

Cyberabad Traffic Police : సైబరాబాద్ పోలీసులు తాజాగా వర్షపు నీటిలో వెళ్తున్న ఓ కారు ప్రమాదానికి గురైన వీడియోను షేర్ చేస్తూ ‘హైడ్రో ప్లానింగ్’ కారణంగా ప్రమాదం జరిగింది అంటూ షేర్ చేశారు. దానిపై జాగ్రత్తలు సూచించారు. అయితే అసలు హైడ్రో ప్లానింగ్ అంటే ఏంటి? దానిని నివారించడం ఎలా?

Nirmaan Org: సైబరాబాద్ కమిషనరేట్‌ పోలీసులకు 1200 రెయిన్‌కోట్‌ల పంపిణీ

CYBERABAD TRAFFIC POLICE లు తమ ట్విట్టర్ ఖాతాలో వర్షపు నీటితో తడిసిన రోడ్డుపై వెడుతూ ప్రమాదానికి గురైన ఓ కారు వీడియోను షేర్ చేసుకున్నారు. ‘హైడ్రో ప్లానింగ్ కారణంగా ప్రమాదం జరిగింది. గమనించి తక్కువ వేగంతో వెళ్లగలరు. వాహనం స్కిడ్ అయ్యేలా మీ టైర్లు మరియు రహదారి మధ్య నీటి పొర ఏర్పడినప్పుడు హైడ్రో ప్లానింగ్ జరుగుతుంది. తడి రోడ్లపై వేగాన్ని తగ్గించండి. పట్టును ఉంచండి’ అనే శీర్షికతో పోస్టు పెట్టారు. అయితే అసలు హైడ్రో ప్లానింగ్ గురించి తెలుసుకుందాం.

 

డ్రైవర్ తన వెహికల్‌పై నియంత్రణ కోల్పోవడం అంత భయంకరమైనది వేరొకటి లేదు. నియంత్రణ కోల్పోవడానికి కారణాలలో ఒకటి హైడ్రో ప్లానింగ్ లేదా ఆక్వా ప్లానింగ్. వర్షాకాలం ప్రారంభమైతే చాలు అనేక ప్రమాదాలు జరుగుతాయి. హైడ్రో ప్లానింగ్ అనేది తడి ఉపరితలంపై కారు టైర్లను స్కిడ్ అయ్యేలా చేస్తుంది. టైర్లు, రోడ్డుకి మధ్య నీటి పొర ఏర్పడినపుడు ఇలా జరుగుతుంది. దీని ఫలితంగా స్టీరింగ్, బ్రేకింగ్ నియంత్రణ కోల్పోవడం జరుగుతుంది. తేలికపాటి వర్షం కురిసిన మొదటి 10 నిముషాలు చాలా ప్రమాదకరం.. ఏదైనా తడి ఉపరితలంపై హైడ్రో ప్లానింగ్ సంభవించవచ్చును. వర్షంలో రోడ్డు మీద పెట్రోలు, ఏదైనా ఆయిల్ వంటివి ఉన్నప్పుడు కూడా వాహనాలు జారే పరిస్థితులు ఏర్పడతాయి.

Telangana Heavy Rains : తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. 8 జిల్లాలకు రెడ్ అలర్ట్, 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

పొగమంచు, వర్షం, మంచు వంటి ప్రతికూల వాతావరణంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే హైడ్రో ప్లానింగ్ నిరోధించాలంటే నాణ్యత ఉన్న టైర్లను ఎంచుకోవాలి. వేగం తగ్గించుకోవాలి. వర్షంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీ కారు క్రూజ్ ఫంక్షన్‌ను ఎప్పుడూ ఉపయోగించకండి. హైడ్రో ప్లానింగ్‌కి గురైన  వెంటనే యాక్సిలరేటర్ నుంచి మీ పాదాలను తీసేయాలి. మీ కారు స్టీరింగ్ వీల్‌ను సున్నితంగా తిప్పాలి. టైర్లు రోడ్డు ఉపరితలాన్ని కనెక్ట్ అవుతున్నట్లు భావించేవరకు వెయిట్ చేయాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే హైడ్రో ప్లానింగ్‌ను నివారించవచ్చును. ఏది ఏమైనా వర్షాకాలంలో రోడ్లపై వేగం తగ్గించి మీ వాహనాన్ని నడపడం ఎంతో మంచింది.