Neeraj Honour Killing: నీరజ్ పరువు హత్య.. స్పందించిన సంజన వదిన Neeraj Honour Killing case... wife family responds

Neeraj Honour Killing: నీరజ్ పరువు హత్య.. స్పందించిన సంజన వదిన

హైదరాబాద్, షాహినాజ్ గంజ్‌లో శుక్రవారం రాత్రి జరిగిన నీరజ్ పరువు హత్యపై, అతడి భార్య సంజన కుటుంబ సభ్యులు స్పందించారు. సంజన వదిన మీడియాతో మాట్లాడుతూ ఈ హత్యతో తమకేం సంబంధం లేదన్నారు.

Neeraj Honour Killing: నీరజ్ పరువు హత్య.. స్పందించిన సంజన వదిన

Neeraj Honour Killing: హైదరాబాద్, షాహినాజ్ గంజ్‌లో శుక్రవారం రాత్రి జరిగిన నీరజ్ పరువు హత్యపై, అతడి భార్య సంజన కుటుంబ సభ్యులు స్పందించారు. సంజన వదిన మీడియాతో మాట్లాడుతూ ఈ హత్యతో తమకేం సంబంధం లేదన్నారు. హత్య జరిగిన సమయంలో తన భర్తతో (సంజన అన్న)పాటు సంజన ఇతర సోదరులు ఇంట్లోనే ఉన్నారని ఆమె చెప్పింది. తమ యాదవ సమాజానికి సంబంధించిన కొందరు యువకులు నీరజ్‌ను హతమార్చారని సంజన వదిన అన్నారు. కాగా, ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలో నీరజ్ మృతదేహానికి పోస్టుమార్టమ్ పూర్తైంది. అతడి మృతదేహాన్ని పోలీసులు, కుటుంబ సభ్యులకు అందజేశారు.

Crime news: హైదరాబాద్ పరువు హత్య కేసులో పురోగతి..

ఈ హత్య కేసులో నీరజ్ కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగుతుందన్నారు. నీరజ్ కుటుంబ సభ్యుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. శుక్రవారం సాయత్రం ఏడున్నర గంటలకు నీరజ్ హత్య జరిగిన సంగతి తెలిసిందే. నీరజ్, సంజన అనే యువతిని ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి ఇష్టం లేని సంజన కుటుంబ సభ్యులు, బంధువులే ఈ హత్యకు పాల్పడి ఉంటారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

×