Netflix: త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఫీచర్

టీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో త్వరలో లైవ్ స్ట్రీమింగ్ ఫీచర్ రానుంది. ఇప్పుడు ఈ ఫీచర్‌ను డెవలప్ చేసే పనిలో ఉంది నెట్‌ఫ్లిక్స్‌. టాలెంట్ షోస్ కూడా లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది నెట్‌ఫ్లిక్స్‌.

Netflix: త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఫీచర్

Netflix

Netflix: ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో త్వరలో లైవ్ స్ట్రీమింగ్ ఫీచర్ రానుంది. ఇప్పుడు ఈ ఫీచర్‌ను డెవలప్ చేసే పనిలో ఉంది నెట్‌ఫ్లిక్స్‌. టాలెంట్ షోస్ కూడా లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది నెట్‌ఫ్లిక్స్‌. దీంతోపాటు వ్యూయర్స్ లైవ్‌లోనే వోట్ చేసే అవకాశం కల్పిస్తారు. ముందుగా ఈ ఫీచర్ ద్వారా స్టాండప్ కామెడీ షోస్ స్ట్రీమ్ చేస్తారు. తర్వాత ఇతర షోస్ కూడా ప్రసారం చేస్తారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు నెట్‌ఫ్లిక్స్‌ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా పాస్‌‌వర్డ్ షేరింగ్ ఆప్షన్ తొలగించనుంది. తక్కువ ధరలోనే ఓటీటీ వాడుకునే మరో ఫీచర్ కూడా తీసుకురానుంది. అయితే, ఈ ఫీచర్ వాడుకునేవాళ్లకు యాడ్స్ ప్లే అవుతాయి.

OTT Platforms: నువ్వా నేనా తేల్చుకుందాం.. ఆడియన్స్ కోసం ఓటీటీల పోటీ!

నెట్‌ఫ్లిక్స్‌ త్వరలో డాన్స్ 100 అనే టాలెంట్ షోను స్ట్రీమ్ చేయనుంది. 300 మంది స్టాండప్ కమెడియన్లతో అమెరికాలో ‘నెట్‌ఫ్లిక్స్‌ ఈజ్ ఎ జోక్’ పేరుతో మరో షోను స్టార్ట్ చేయబోతుంది. ఇప్పటికే ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్’ లైవ్ స్ట్రీమింగ్ సర్వీస్ మొదలుపెట్టింది. ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ కూడా లైవ్ స్ట్రీమింగ్ చేస్తోంది. దీంతో ఇప్పుడు ఈ ఫీచర్‌పై నెట్‌ఫ్లిక్స్‌ దృష్టిపెట్టింది. మరోపక్కన కొంతకాలంగా నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. పదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఇటీవల సబ్‌స్క్రైబర్లు తగ్గారు. దీంతో సబ్‌స్క్రైబర్లను పెంచుకోవడం కోసం నెట్‌ఫ్లిక్స్‌ అన్ని అవకాశాల్ని పరిశీలిస్తోంది.