OTT Platforms: నువ్వా నేనా తేల్చుకుందాం.. ఆడియన్స్ కోసం ఓటీటీల పోటీ!

పోటాపోటీగా దూసుకుపోతున్నాయి ఓటీటీలు. కొవిడ్ తర్వాత సినిమా హాళ్లకి దూరమై హోమ్ థియేటర్స్ కి అలవాటు పడ్డ ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేయడమే పనిగా పెట్టుకున్నాయి. ఆహా 40.. ప్రైమ్ 40 అంటే జీ5 ఏకంగా 80 అనేసింది. తెలుగు ఓటీటీ ఆహా 40 అనేసింది.

OTT Platforms: నువ్వా నేనా తేల్చుకుందాం.. ఆడియన్స్ కోసం ఓటీటీల పోటీ!

Ott Platforms

OTT Platforms: పోటాపోటీగా దూసుకుపోతున్నాయి ఓటీటీలు. కొవిడ్ తర్వాత సినిమా హాళ్లకి దూరమై హోమ్ థియేటర్స్ కి అలవాటు పడ్డ ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేయడమే పనిగా పెట్టుకున్నాయి. ఆహా 40.. ప్రైమ్ 40 అంటే జీ5 ఏకంగా 80 అనేసింది. తెలుగు ఓటీటీ ఆహా 40 అనేసింది. 40కు పైగా వెబ్‌ సిరీస్‌, సినిమాలతో ఎంటర్‌టైన్‌ చేసేందుకు ప్రైమ్ రెడీ అయింది. మేమేం తక్కువ కాదంటూ జీ5.. ఆ నంబర్ ను డబుల్ చేసి 80కి పైగా ప్రాజెక్టులను ఓటీటీ లవర్స్ ముందుంచేందుకు సిద్ధమవుతోంది. ఈ 2022 ఏడాదిలో వచ్చే బ్లాక్‌ బస్టర్‌ కంటెంట్‌ స్లేట్‌ను జీ5 రిలీజ్‌ చేసింది. అసలేంటి 40, 80 గోల అంటారా.. అయితే ఈ స్టోరీ చూసేయండి.

OTT Platforms: ఓటీటీ వందల కోట్ల ఆఫర్స్.. హాట్ కేక్‌లా బిగ్ మూవీస్!

కోవిడ్ తర్వాత ఓటీటీల వాడకం విపరీతంగా పెరిగింది. సినిమా ఫెంటాస్టిక్ అన్న టాక్ వస్తేనే థియేటర్ కి లేదంటే మనకు ఓటీటీ ఉందిగా అన్నట్టు ప్రేక్షకులు తయ్యారయ్యారు. స్టార్స్ సినిమాలను పక్కనపెడితే వెబ్‌సిరీస్‌, డైరెక్ట్ రిలీజెస్, స్పెషల్‌ షోలతో ఓటీటీలు స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ కు కావాల్సినంత వినోదాన్ని పంచుతున్నాయి. తెలుగువారికి నచ్చే తెలుగు వారు మెచ్చే కంటెంట్‌ను అందించడానికి ఆహా ఓటీటీ బాగా ట్రై చేస్తోంది. అయితే ఎండలు మండే మే నెలలో బయటికేం వెళ్తాంలే అనుకునే వారి కోసం ఆహా గుడ్ న్యూస్ చెప్పేసింది. 30కి పైగా బ్లాక్‌బస్టర్‌ హాలీవుడ్‌ సినిమాలను తెలుగులో అందించనున్నట్లు ప్రకటించింది.

OTT Platforms: ఓటీటీల పోటీ.. స్ట్రీమింగ్ రైట్స్ కోసం కాంపిటీషన్

‘అనకొండ’, ‘బ్యాడ్‌ బాయ్స్‌ 2’, ‘చార్లీస్‌ ఏంజెల్స్‌’, ‘మెన్‌ ఇన్‌ బ్లాక్‌’, ‘స్పైడర్‌ మ్యాన్‌’, ‘టెర్మినేటర్‌’, ‘రెసిడెంట్‌ ఈవిల్‌’, ‘బ్లాక్‌ హాస్‌ డౌన్‌’ సహా మరికొన్ని హాలీవుడ్ హాట్ మూవీస్ ఆహాలో స్ట్రీమింగ్ కానున్నాయి. ఈమధ్యే మలయాళ సూపర్‌ హిట్‌ ‘దొంగాట’ ఆహాలో రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. ఆహాపురంలో ప్రతి శుక్రవారం ఒక కొత్త సినిమా రిలీజ్‌ చేస్తామని ఇదివరకే ప్రకటించినట్టు క్రేజీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ రెడీగా ఉన్నాయని చెబుతోంది ఆహా. ఒక్క సినిమాలే కాదు ఆహాలో ప్రసారమవుతోన్న తెలుగు ఇండియన్‌ ఐడల్‌ షో, సర్కారు వంటివి మంచి పేరు సంపాదిస్తున్నాయి.

OTT Platforms: మేకర్స్ కు ఓటీటీ బిగ్ ఆఫర్స్.. ఊ అంటారా.. ఊహూ అంటారా!

ఓటీటీ రంగంలో తోపు అనిపించుకునేందుకు అమెజాన్ ప్రైమ్ గట్టిగా ప్రయత్నిస్తోంది. విపరీతంగా డబ్బు ఖర్చుపెట్టి మరీ భారీగా రాబడిని రాబడుతోంది. ఈమధ్యే ప్రైమ్‌ వీడియో తన సబ్‌ స్క్రైబర్లను గుడ్ న్యూస్త్ తో అలర్ట్ చేసింది. కొత్త కొత్త వెబ్‌ సిరీస్‌ లు, సినిమాలతో పండగ చేసుకోమని బిగ్ ఈవెంట్ నిర్వహించి మరీ చెప్పేసింది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో రానున్న రోజుల్లో దాదాపు 40 ఒరిజినల్‌ వెబ్‌ సిరీస్‌ లు, సినిమాలను ప్రేక్షకులకు అందించనున్నట్లు ప్రకటించింది. తెలుగు, తమిళ, హిందీతోపాటు వివిధ భాషల్లో వీటిని నిర్మిస్తున్నారు.

OTT platformsలో ALTBalaji.. adult కంటెంట్ కాదు లోకల్ కంటెంట్ మాత్రమే

కరణ్‌ జోహార్‌ ధర్మ ఎంటర్‌టైన్‌మెంట్‌, రితేశ్ సిద్వానీ-పర్హాన్ అక్తర్‌ ల ఎక్సెల్ మీడియా, నిఖిల్‌ అడ్వానీ ఎమ్మీ ఎంటర్‌టైన్‌మెంట్‌, రాజ్‌ అండ్‌ డీకే ఫిల్మ్స్‌ ఇలా మరికొన్ని ప్రొడక్షన్ హౌజులతో ప్రైమ్ టై అప్ అయింది. బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌజ్ లతో కలిసి క్రేజీ ప్రాజెక్టులను తెరకెక్కిస్తోంది. మొత్తం 22 ఒరిజినల్‌ స్క్రిప్టెడ్‌ సిరీస్‌, 9 రిటర్నింగ్‌ సిరీస్‌, 3 అమెజాన్‌ ఒరిజినల్‌ ఫిల్మ్స్‌, 2 కో-ప్రొడక్షన్స్‌ వాటిలో ఉన్నాయి. వీటిలో నాగ చైతన్య హీరోగా విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన దూత వెబ్‌ సిరీస్.. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి నటించిన ఫర్జీ, సోనాక్షి సిన్హా దహడ్, నవీన్ చంద్ర అమ్ము, ఆర్య ది విలేజ్, సూపర్ కాస్ట్ తో మోడ్రన్ లవ్ ముంబై, మోడ్రన్ లవ్ హైదరాబాద్, చైన్నై ఇలా రకరకాల వెబ్ సిరీస్ లను ప్లాన్ చేసింది ప్రైమ్.

Theaters VS OTT: నువ్వా నేనా.. టైమ్ చూసి దెబ్బ కొడుతున్న ఓటీటీలు!

ప్రైమ్ సూపర్ హిట్‌ సిరీస్‌ లు మీర్జాపూర్‌ 3, ది ఫ్యామిలీ మ్యాన్‌ 3, ఫోర్ మోర్ షాట్స్‌ ప్లీజ్ 3 కూడా త్వరలోనే ముహూర్తం పెట్టారు. ఇక ముంబై డైరీస్‌ 2, మేడ్ ఇన్‌ హెవెన్‌ 2, పాతాళ్‌ లోక్‌ 2, కామిక్‌స్తాన్‌ 3, బ్రీత్: ఇన్‌టు ది షాడోస్‌ సీజన్‌ 2, పంచాయతీ ఎస్‌2 వంటివి కూడా రానున్న రోజుల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. అలాగే రోహిత్ శెట్టి దర్శకత్వంలో సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టి, వెవేక్‌ ఒబేరాయ్‌, ఇషా తల్వార్‌ కీ రోల్స్ లో నటించిన ‘ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌’ అనె వెబ్‌ సిరీస్‌ కూడా రానుంది.

OTT Series: క్రైమ్ క్రేజ్.. ఓటీటీల్లో విశ్వరూపం చూపిస్తున్న హీరోయిన్లు!

ప్రస్తుతం సెట్స్ పై ఉన్న కొన్ని క్రేజీ సినిమాలను కూడా ప్రైమ్ తన అకౌంట్ లోనే వేసుకుంది. అక్షయ్ కుమార్, సత్యదేవ్ నటిస్తోన్న రామ్ సేతు ప్రైమ్ లోనే డైరెక్ట్ స్ట్రీమింగ్ కానుంది. ఇక థియేటర్ రిలీజ్ తర్వాత స్ట్రీమింగ్ చేసేలా భారీ రేట్ పెట్టి మరీ షారుఖ్ పఠాన్, సల్మాన్ టైగర్ 3 సినిమాల రైట్స్ దక్కించుకుంది. ఈ నెల చివరికల్లా ఈ ఇయర్ సెన్సేషన్ కేజీఎఫ్2ను కూడా తన లైబ్రరీలో ప్లేస్ చేయబోతుంది ప్రైమ్. ఇక లేటెస్ట్ రిలీజ్ ఆచార్య ఎర్లీ బర్డ్ గా మే 20 నుంచి ప్రైమ్ వేదికగా సందడి చేయనుంది.

OTT Release Clash: నువ్వా.. నేనా.. ఓటీటీల్లోనూ రిలీజ్ వార్

హిందీ, తమిళం, తెలుగు, పంజాబీ, బెంగాలీ.. ఇలా అన్ని భాషల్లో పాన్ ఇండియా లెవెల్ లో మొత్తంగా 80కు పైగా సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను అందించనుంది జీ5. వీటిలో 40కు పైగా ఒరిజినల్‌ షోలు, 40కు పైగా సినిమాలు ఉన్నాయి. కట్టిపడేసే థ్రిల్లర్‌ ఫ్లిక్స్, హై-వోల్టేజ్‌ యాక్షన్‌ మూవీస్, గ్రిప్పింగ్‌ కంటెంట్, లైట్‌-హార్టెడ్‌ కామెడీ, రొమాంటిక్ జోనర్ ఇలా ఓటీటీ ఆడియెన్స్ ను పూర్తిస్థాయిలో ఎంగేజ్ చేసేలా జీ5 కసరత్తులు చేస్తోంది. ప్రస్తుతానికైతే ది కాశ్మీర్ ఫైల్స్ తో రికార్డ్ లు కొల్లగొడుతోంది. నేషనల్ ఆడియెన్స్ కు కనెక్ట్ అవడంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ముందుంది. దాని తలదన్నేలా జీ5 అడుగులు వేస్తోంది. రకరకాల సబ్ స్క్రైబర్స్.. వారి టేస్ట్ కు తగ్గట్టు ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేలా స్ట్రాటజీని అమలుచేస్తోంది జీ5. అందుకే బీబీసీ స్టూడియోస్, అప్లాజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ది వైరల్‌ ఫీవర్‌ వంటి క్రియేటివ్‌ నిర్మాణ సంస్థలతో చేతులు కలిపింది.

YRF Entertainment: యశ్‌రాజ్ భారీప్లాన్.. సల్మాన్, షారుఖ్, హృతిక్‌తో వెబ్ సిరీస్!

వెట్రిమారన్‌, ప్రకాశ్‌ రాజ్, అమితాబ్‌, నాగరాజ్‌ మంజులే వంటి టాలెంటెడ్ యాక్టర్స్ తో వీటిని ప్లాన్ చేసింది. హిందీ ఒరిజినల్‌ విభాగంలో ప్రస్తుతం తాజ్‌, ఫొరెన్సిక్‌, దురంగ, అభయ్‌ 3, సన్‌ ఫ్లవర్‌ 2, ట్రిప్లింగ్ 3, నెవర్‌ కిస్‌ యువర్‌ బెస్ట్ ఫ్రెండ్‌ 2 వంటి కొత్త సీజన్‌లు ఉన్నాయి. ఇంకా ఇవే కాకుండా రంగ్‌బాజ్‌ 3, జుండ్‌, అటాక్‌ వంటివి ఇప్పటికే ప్లే అవుతుండగా.. గాలివాన తెలుగు వెబ్‌ సిరీస్‌ మంచి టాక్ సాధించింది. వీటితో పాటూ మరికొన్ని భాషల్లో కూడా కొత్త కంటెంట్ బాగా రన్ అవుతోంది. ఇక నేషనల్ ఆడియెన్స్ వెయిట్ చేస్తోన్న ట్రిపుల్ ఆర్ కూడా జీ5లో ముహూర్తం పెట్టేసుకుంది. సౌత్ లాంగ్వెజెస్ అన్నింటిలో రాజమౌళి, రామ్ చరణ్, రామారావ్ కాంబో మూవీ మే 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది.