Byju AD : షారుక్ ఖాన్ కు కష్టాలు తప్పవా ? ఆ యాడ్ నుంచి తొలగిస్తారా ?

ట్విట్టర్ వేదికగా..బైజూస్ ట్యాగ్ బాగా ట్రెండ్ అయ్యింది. పిల్లలను సక్రమంగా పెంచని షారూక్ ను బ్రాండ్ అంబాసిడర్ నుంచి తొలగించాలని పలువురు బైజూస్ ను కోరుతున్నారు.

Byju AD : షారుక్ ఖాన్ కు కష్టాలు తప్పవా ? ఆ యాడ్ నుంచి తొలగిస్తారా ?

Srk

Shahrukh Khan Byju AD : బాలీవుడ్ లో బాద్ షాగా పేరొందిన షారుక్ ఖాన్ కొత్త కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. అతని కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ వ్యవహారంలో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. క్రూయిజ్ షిప్ పార్టీలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు తనిఖీలు నిర్వహించి..అక్కడనే ఉన్న ఆర్యన్ అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆపై అరెస్టు కూడా చేశారు. ఈ వ్యవహారం..షారూక్ పై ఎఫెక్ట్ పడుతుందని భావిస్తున్నారు. షారూక్ పై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. పిల్లలను సరిగ్గా పెంచడం చేతకాని..అతను…ఓ మేధావి క్యారెక్టర్ లో బైజూస్ యాడ్ లో నటించడం…పిల్లల విషయంలో పాఠాలు చెప్పడం..సలహాలు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తున్నారు పలువురు.

Read More : UP Lakhimpur Kheri : లఖింపూర్ ఖేరిలో తీవ్ర ఉద్రిక్తం, ప్రియాంక గాంధీ అరెస్టు ?

Srk Khan

ట్విట్టర్ వేదికగా..బైజూస్ ట్యాగ్ బాగా ట్రెండ్ అయ్యింది. పిల్లలను సక్రమంగా పెంచని షారూక్ ను బ్రాండ్ అంబాసిడర్ నుంచి తొలగించాలని పలువురు బైజూస్ ను కోరుతున్నారు. ఈ క్రమంలో బైజూస్ రంగంలోకి దిగినట్లు, పలువురు సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో…షారూక్ ను బ్రాండ్ అంబాసిడర్ నుంచి తప్పించడంతో పాటు..ఇప్పటికే తీసిన యాడ్ లను టీవీల్లో టెలికాస్ట్ కాకుండా నిలిపివేయాలని బైజూస్ నిర్ణయించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ వ్యవహారం ప్రభావం..మరికొన్ని బ్రాండ్ లపై ప్రభావం చూపిస్తుందని, షారూక్ కు దూరం అయ్యే అవకాశం ఉందని కోరెరో కన్సల్టింగ్ అండ్ కమ్యూనికేషన్స్ ఫౌండర్ సలిల్ వైద్యా అంచనా వేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా షారూక్ సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బ్రాండ్ ఇమేజ్ కు దూరమయితే షారూక్ కష్టాలు తప్పవని అంటున్నారు కొందరు.

Read More : SRK’s Son Aryan : క్రూయిజ్ డ్రగ్స్ కేసు, ఆర్యన్ ఖాన్‌‌కు బెయిల్ వస్తుందా ?

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సతీమణి నటి జయా బచ్చన్ ను కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. గతంలో బాలీవుడ్ డ్రగ్స్ ఆరోపణలు వెల్లువెత్తున్న సమయంలో…చిత్ర పరిశ్రమను వెనుకొసుకొచ్చారు. బాలీవుడ్ డ్రగ్స్ సంస్కృతి కొనసాగుతోందని…నటుడు, లోక్ సభ ఎంపీ రవికిషన్ గతంలో పార్లమెంట్ లో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు జయా బచ్చన్ కౌంటర్ ఇచ్చారు. కొందరు ఆధారంగా మొత్తం పరిశ్రమను నిందించడం సరికాదని జయ ప్రసంగించారు. ఇప్పుడా ఆ విషయాన్ని మరలా నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఏమంటారు జయజీ అంటూ ప్రశ్నిస్తున్నారు.