Corona Control : తెలంగాణలో కరోనా కట్టడికి కొత్త వ్యూహాలు.. లక్షణాలున్న ప్రతి ఒక్కరికి కోవిడ్ కిట్ పంపిణీ

తెలంగాణ ప్రభుత్వం ప్రతి రోగికీ 200 రూపాయల విలువ చేసే డైట్ ప్లాన్ అందించనుంది. ఇంటింటికీ ఆరోగ్యం అనే పేరుతో సర్వే నిర్వహించనుంది. ప్రత్యేక బృందాలు అన్ని గ్రామాల్లో పర్యటిస్తాయి.

Corona Control : తెలంగాణలో కరోనా కట్టడికి కొత్త వ్యూహాలు.. లక్షణాలున్న ప్రతి ఒక్కరికి కోవిడ్ కిట్ పంపిణీ

Covid Kit

New strategies for corona control : తెలంగాణ కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. కరోనా కేసుల పెరుగుదలపై సమీక్ష జరిపిన మంత్రులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కోవిడ్ కట్టడికి కొత్త వ్యూహాలు అమలు చేయాలని నిర్ణయించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కేటీఆర్‌, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు సీఎస్ సోమేష్ కుమార్ ఈ సమీక్షలో పాల్గొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతి రోగికీ 200 రూపాయల విలువ చేసే డైట్ ప్లాన్ అందించనుంది. ఇంటింటికీ ఆరోగ్యం అనే పేరుతో సర్వే నిర్వహించనుంది. ప్రత్యేక బృందాలు అన్ని గ్రామాల్లో పర్యటిస్తాయి. రోజుకు 25ఇళ్లను సందర్శిస్తాయి. కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ కోవిడ్ కిట్ అందిస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో కోవిడ్ ఓపీ సర్వీసులు ప్రారంభిస్తారు. కరోనా మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పంపిణీ కొనసాగించనున్నారు. అలాగే వ్యాక్సినేషన్‌ను మరింత వేగంగా నిర్వహించనున్నారు.

BJP MLA: బీజేపీ ఎమ్మెల్యేని పరుగులు పెట్టించిన గ్రామస్థులు

అధికారులు ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వారికి ప్రత్యేక కిట్ అందిస్తారని చెప్పారు. మార్కెట్ లో కరోనా కిట్ల కొరత ఉందన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో వైద్య ఆరోగ్యశాఖ కరోనా కిట్లను పెద్ద సంఖ్యలో సేకరించిందన్నారు. ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు, ఒంటి నొప్పులు, ఆయాసం ఉంటే దగ్గల్లోని దవాఖానాల్లో హోం ఐసోలేషన్ కిట్ ఇస్తారని తెలిపారు. ప్రజలు టెస్టింగ్ సెంటర్ల వద్ద క్యూలో నిలబడాల్సిన అసవరం లేదన్నారు. అధికార యంత్రాంగమే ప్రజల వద్దకు వస్తుందని తెలిపారు.