KGF3: కేజీయఫ్3లో బాలీవుడ్ స్టార్ హీరో.. నెట్టింట వైరల్!

కన్నడలో తెరకెక్కిన కేజీయఫ్, కేజీయఫ్ చాప్టర్ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్....

KGF3: కేజీయఫ్3లో బాలీవుడ్ స్టార్ హీరో.. నెట్టింట వైరల్!

News Of Hrithik Roshan In Kgf3 Goes Viral

KGF3: కన్నడలో తెరకెక్కిన కేజీయఫ్, కేజీయఫ్ చాప్టర్ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన విధానం, ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఇక ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యశ్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో రాఖీ భాయ్‌గా యశ్ చేసిన యాక్టింగ్‌కు కేవలం సౌత్ ఆడియెన్స్ మాత్రమే కాకుండా నార్త్ ఆడియెన్స్ కూడా బ్రహ్మరథం పట్టారు. ఇక ‘కేజీయఫ్-2’ సినిమా ఇండియాలో బాహుబలి2 తరువాత స్థానంలో నిలిచిందంటే ఈ సినిమా ఏమేర కలెక్షన్స్ వసూలు చేసిందో అర్థం చేసుకోవచ్చు.

KGF3: సలార్ తర్వాత కేజీఎఫ్ 3.. మరి ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు?

అయితే కేజీయఫ్2 సినిమా ముగింపులోనే కేజీయఫ్3 గురించి ఓ హింట్ ఇచ్చాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో కేజీయఫ్3 ఖచ్చితంగా ఉంటుందని ఆయన చెబుతూ వస్తున్నారు. కాగా.. తాజాగా కేజీయఫ్ 3 సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతోంది. కేజీయఫ్3 సినిమాలో ఓ బాలీవుడ్ స్టార్ హీరో నటించబోతున్నాడని.. ఆయన పాత్రను దర్శకుడు ప్రశాంత్ నీల్ చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశాడని.. అందుకే ఈ సినిమాలో నటించేందుకు ఆ స్టార్ హీరో ఓకే చేశాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

KGF3: కేజీఎఫ్3 ఎలా ఉండబోతుంది?.. స్టోరీ ఇదేనా?

ఆ స్టార్ హీరో మరెవరో కాదు.. బాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్. ప్రశాంత్ నీల్ ఇప్పటికే హృతిక్ రోషన్‌తో కేజీయఫ్3లోని పాత్రకు సంబంధించి చర్చ జరిపాడని.. అయితే హృతిక్ మాత్రం ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ సినిమాను అతి త్వరలోనే పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇటీవల కేజీయఫ్ నిర్మాత కేజీయఫ్3 గురించిన క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాను తెరకెక్కించాలని తాము కూడా చూస్తున్నామని.. అయితే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో, ఆయన ఫ్రీ అయ్యాకే కేజీయఫ్ 3 గురించి ఆలోచిస్తాం అంటూ చెప్పుకొచ్చారు. దీంతో నెట్టింట వైరల్ అవుతున్న కేజీయఫ్3 వార్తలు కేవలం పుకార్లేనని అభిమానులు తేల్చి చెబుతున్నారు.