Niharika Konidela : ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసిన నిహారిక.. కారణం ఏంటి??

తాజాగా ఈ మెగా డాటర్ నిహారిక లక్షల ఫాలోవర్స్ ఉన్న ఇంస్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేశారు. సెలబ్రిటీలు సాధారణంగా సోషల్ మీడియాతోనే తమ అభిమానులతో టచ్ లో ఉంటారు. తమకి సంబంధించిన అన్ని.......

Niharika Konidela :  ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసిన నిహారిక.. కారణం ఏంటి??

Niharika

Niharika Konidela :  మెగా డాటర్ నిహారిక తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. హీరోయిన్ గా సినిమాలు, వెబ్ సిరీస్ లతో పాటు నిర్మాతగా కూడా చేస్తూ కెరీర్ ని ప్లాన్ చేసుకుంది. అయితే సినిమాలలో అంత సక్సెస్ రాకపోయినా యూట్యూబ్ లో, నిర్మాతగా మాత్రం ముందుకెళ్తుంది. మధ్యలో సడెన్ గా చైతన్యని పెళ్లి చేసుకుంది. అయినా పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేయకపోయినా వెబ్ సిరీస్ లలో నటిస్తానని, నిర్మాతగా సినిమాలు, సిరీస్ లు నిర్మిస్తానని గతంలోనే ప్రకటించింది.

అయితే తాజాగా ఈ మెగా డాటర్ నిహారిక లక్షల ఫాలోవర్స్ ఉన్న ఇంస్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేశారు. సెలబ్రిటీలు సాధారణంగా సోషల్ మీడియాతోనే తమ అభిమానులతో టచ్ లో ఉంటారు. తమకి సంబంధించిన అన్ని విషయాలు సోషల్ మీడియా ద్వారానే తెలియచేస్తారు. మరి సడన్ గా నిహారిక తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని ఎందుకు డిలీట్ చేసిందో ఎవరికీ అర్ధం కావట్లేదు.

Varshini Sounderajan : టాప్ తీసేసి టాప్ లేపిన యాంకర్ వర్షిణి..

అయితే ఇంస్టాగ్రామ్ అకౌంట్ డిలేట్ చేసే ముందు నిహారిక ఓ వీడియోని పోస్ట్ చేసింది. ఆ వీడియోలో తన జిమ్ ట్రైనర్ వీపుపై కూర్చొని ఉండగా అతడు పుష్ అప్స్ చేశాడు. ఈ వీడియో నిహారిక ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లో వైరల్ గా మారింది. దీంతో ఈ పోస్ట్ చూసి వారి అత్తగారింట్లో ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తుంది. పెళ్లి అయిన తర్వాత ఇలాంటి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో నిహారిక అత్తమామలకు ఆగ్రహం తెప్పించిందట. ఈ విషయం గురించి నిహారికతో మాట్లాడగా తను ఏకంగా ఇంస్టాగ్రామ్ అకౌంట్ నే డిలీట్ చేసిందని సమాచారం. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలీదు కానీ మెగా అభిమానులు మాత్రం నిహారిక అకౌంట్ ని ఎందుకు డిలీట్ చేసింది అని జుట్టు పీక్కుంటున్నారు.